ఫ్లెక్సీలు వద్దు ..డబ్బులు ఇవ్వండి: తేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మంగళవారం(అక్టోబర్ 15)న సుప్రీమ్ హీరో సాయితేజ్ పుట్టినరోజు . ఈ సందర్భంగా సాయితేజ్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో తాను ఓ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనుకుంటున్నానని, అందుకోసం ఓ వృద్ధాశ్రమాన్ని నిర్మించి వారికి ఓ సంవత్సరం పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పంపిన వీడియోలో
``మెగాభిమానులకు థ్యాంక్స్. నా పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్, ఫ్రెండ్స్ వాళ్ల ఊళ్లలో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నాకొక ఆలోచన వచ్చింది. ఓ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనుకున్నాను. ఆ సమయంలో ఓ వృద్ధాశ్రమం వారు ట్విట్టర్ నన్ను ట్యాగ్ చేసి సహాయం చేయమని అడిగారు. ఆ మొత్తం ఖర్చు నేనే భరిస్తా. ఎవరు నాకు ఫ్లెక్సీలు పెట్టొద్దు. ఆ డబ్బులు నాకిస్తే..వృద్ధాశ్రమం పూర్తి కావడానికి మీ తరపున నేను వారికి డబ్బులు ఇస్తానని చెప్పాగానే.. చాలా మంది డబ్బులు పంపారు. దాదాపు లక్ష రూపాయలు దాకా డబ్బులు వచ్చాయి. ఈ సాయం అందించిన వారందరికీ థ్యాంక్స్. ఇదేదో నేను గొప్పులు చెప్పుకోవడానికి కాదు.. నన్ను చూసి ఎవరైనా స్ఫూర్తి పొందితే మరో సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశ `` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.