close
Choose your channels

SK30: 'ధమాకా' డైరెక్టర్‌తో సందీప్ కిషన్.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

Tuesday, March 12, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ధమాకా డైరెక్టర్‌తో సందీప్ కిషన్.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

యువ హీరో సందీప్ కిషన్ ఇటీవల 'ఊరుపేరు భైరవకోన' చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. దీంతో ఇదే సక్సెస్ కొనసాగేందుకు పక్కా ప్లానింగ్‌తో కథలు సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో ల్యాండ్ మార్క్ అయిన 30వ చిత్రాన్ని హిట్‌ కాంబోలో చేయడానికి సిద్ధమయ్యాడు. 'సినిమా చూపిస్తా మావ', 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ విజయాలను తీసిన త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ కొత్త చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లను ప్రసన్న కుమార్ బెజవాడ అందిస్తున్నాడు.

వీరిద్దరిది హిట్ కాంబినేషన్. ఇప్పుడు వీరిద్దరు కలిసి సందీప్ కిషన్‌తో చిత్రం చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నాయి. ఇప్పటికే ఈ రెండు సంస్థలు 'సామజవరగమన', 'ఊరు పేరు భైరవకోన' వంటి హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్‌ కొట్టేందుకు రెడీ అయ్యాయి. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో త్రినాథరావు నక్కిన, ప్రసన్నల మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండనుందట.

ధమాకా డైరెక్టర్‌తో సందీప్ కిషన్.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సిబ్బంది వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. మొత్తానికి సక్సెస్ ఫుల్ కాంబోలో ఈ చిత్రం తెరకెక్కతుండటంతో సినిమాపై మంచి భజ్ ఏర్పడింది. తండ్రి కొడుకు నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే ఈ కథను మెగాస్టార్ చిరంజీవితో తీయాలి అనుకున్నారు. తండ్రి పాత్రలో చిరు, కొడుకు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ నటించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరు వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ మూవీ సందీప్ కిషన్ తలుపు తట్టింది. ఇందులో తండ్రి పాత్రలో రావు రమేష్ నటించనున్నాడట. మొత్తానికి ఈ సినిమాతో సందీప్ మరో హిట్ కొట్టడం ఖాయమని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.