ప్రారంభమైన సందీప్ కిష‌న్ 'A1 ఎక్స్‌ప్రెస్‌'

  • IndiaGlitz, [Monday,November 04 2019]

నిను వీడ‌ని నీడ‌ను నేనే' చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం 'A1 ఎక్స్‌ప్రెస్‌'. సోమ‌వారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేటి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు, సందీప్ కిష‌న్‌ల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. హ‌కీ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది. అలాగే ఈ జోన‌ర్‌లో సందీప్ కిష‌న్ చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

More News

'తిప్ప‌రామీసం' సినిమాను అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాను: శ్రీవిష్ణు

శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి హీరో హీరోయిన్లుగా రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, కృష్ణ విజయ్ L ప్రొడక్షన్స్ మరియు శ్రీ ఓం సినిమా బ్యాన‌ర్స్‌పై రిజ్వాన్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం

బిగ్ బాస్-3 ఫినాలేలో నాగ్ కంటే చిరునే హైలేట్!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్.. జూలై 22న 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమై నవంబర్-03తో ముగిసింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ అంటే విన్నర్‌ ఎవరో ప్రకటించే రోజు మెగాస్టార్ చిరంజీవి

బిగ్‌బాస్-3 విన్నర్.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్- 3 షో.. మూడు నెలల క్రితం ప్రారంభమై నవంబర్ 3తో ముగిసింది. అయితే షో మొదలైన మొదటి ఎపిసోడ్ నుంచి వివాదాలు, సంవాదాలతో ఉత్కంఠ భరితంగా సాగింది.

అనుష్క పాత్రలో దీపికా ప‌దుకొనె

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి స్టార్ స్టేట‌స్‌ను ఇచ్చిన చిత్రం `అరుంధ‌తి`. 2009లో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ట‌య్యింది. ప‌దేళ్ల త‌ర్వాత ఇప్పుడు

బిగ్‌బాస్-3 విన్నర్‌గా ఎవరూ ఊహించని వ్యక్తి!?

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్‌ విన్నర్ ఎవరో తెలిసిపోయింది అంటూ గత మూడ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే పక్కా సమాచారం ఎవరైనా లీక్ చేశారా..?