టాలీవుడ్ సీనియర్ నటి గీతాంజలి ఇకలేరు

  • IndiaGlitz, [Thursday,October 31 2019]

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇప్పటికే ఒకట్రెండు సార్లు ఆస్పత్రికి వెళ్లి వైద్యం తీసుకోవడంతో ఆమె ఆరోగ్యం కుదుటపడింది. అయితే ఈసారి కూడా కోలుకుంటారని.. భావించిన కుటుంబ సభ్యులకు చివరికి విషాదమే మిగిలింది. తమ తోటి నటి ఇక లేరన్న విషయం తెలుసుకున్న టాలీవుడ్ పెద్దలు నిర్ఘాంతపోయారు. హైదరాబాద్‌లో ఉన్న పలువురు సీనియర్ నటీనటులు పెద్ద ఎత్తున అపోలో ఆస్పత్రికి చేరుకుని గీతాంజలి భౌతికకాయానికి నివాళులు అర్పించి.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇండస్ట్రీ వైపు అడుగులు ఇలా..!

1957లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీరామమూర్తి, శ్వామసుందరి దంపతులకు గీతాంజలి జన్మించారు. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీ వైపు అడుగులేశారు. నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండవ అమ్మాయి. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో కొన్నేళ్లు చదివారు. మూడేళ్ల ప్రాయం నుంచే గీతాంజలి తన అక్క స్వర్ణతో పాటు కాకినాడలోని గంధర్వ నాట్యమండలిలో లక్ష్మారెడ్డి, శ్రీనివాసన్‌ల వద్ద నాట్యం నేర్చుకోవటం ప్రారంభించారు. నాలుగేళ్ల నుంచే అక్కతో పాటు సభల్లో నాట్య ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించారు. ‘సీతారామ కల్యాణం’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించిన ఈమె బాలనటిగా బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. ‘సీతారామ కల్యాణం’, ‘కలవారి కోడలు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మురళీకృష్ణ’, ‘కాలం మారింది’ సినిమాలు ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అప్పట్లో గీతాంజలి, పద్మనాభం ఇద్దరూ హిట్ పెయిర్‌గా నిలిచారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ చిత్రాలే వచ్చాయి. వరుస సినిమాలతో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. అలా మంచి క్రేజ్ ఉన్న టైమ్‌లో సహనటుడు రామకృష్ణను ప్రేమించిన గీతాంజలి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె కొన్నేళ్లపాటు సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గీతాంజలి తల్లి పాత్రల్లో నటించారు.

గీతాంజలి అనే పేరెలా వచ్చింది!

గీతాంజలి దక్షిణ భారత భాషలన్నింటితో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించారు. కన్నడలో రెండు సినిమాలు, మలయాళంలో మూడు సినిమాలు, ఒక డజనుకు పైగా హిందీ సినిమాల్లోనూ నటించింది. ఈమె అసలు పేరు మణి కాగా.. ‘పారస్ మణి’ అనే హిందీ చిత్రంలో పనిచేస్తుండగా ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సినిమా టైటిల్లోనూ మణి ఉంది కాబట్టి ఈమెకు గీతాంజలి అని నామకరణం చేశారు. ఆ పేరు సినీరంగంలో అలానే స్థిరపడిపోయారు. చివరగా గీతాంజలి నటించిన చిత్రం నాగార్జున హీరోగా వచ్చిన ‘భాయ్’. తమన్నా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ లోనూ నటించగా.. ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాలేదు. సినీ రంగంలో తకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ఆమె రాజకీయాల్లో రాణించాలని.. దివంగత ముఖ్యమంత్రి అన్నగారు నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో గీతాంజలి చేరారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆమె ఇంటికే పరిమితమయ్యారు. తన కుటుంబం నుంచి కుమారుడ్ని ‘భామ’ అనే మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

More News

శివసేనకు బీజేపీ కొత్త బంపరాఫర్.. రాజీ కుదిరేనా!?

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై దాదాపు కొలిక్కి వచ్చేసినట్లేనని తెలుస్తోంది.

'భాస్కర్ ఒక రాస్కల్ ' గా వస్తున్న అరవింద స్వామి

అరవిందస్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో సిద్ధికీ తమిళంలో రూపొందిన భాస్కర్ ఓరు రాస్కల్  ఇప్పడు తెలుగులో భాస్కర్

బాలయ్య వియ్యంకుడికి షాకిచ్చిన వైఎస్ జగన్!

ఇదేంటి బాలయ్య పేరు ఎందుకొచ్చింది..? అసలు ఈ షాకులేంటి..? ఆయనెవరికో షాకిస్తే బాలయ్యకు ఏంటి సంబంధం అని మీరు అనుకుంటున్నారు కదూ..?

రామ్ `రెడ్` రిలీజ్ డేట్ ఫిక్స్‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం `రెడ్‌` నేడు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

రాజకీయాల‌కే తొలి ప్రాధాన్య‌త‌ : విజ‌య‌శాంతి

``రాజకీయాల‌నేవి పూర్తి అంకిత భావంతో చేయాలి. కాబ‌ట్టి ప్ర‌స్తుతం నా ప్రాధాన్య‌త ముందు రాజ‌కీయాల‌కే`` అని అంటున్నారు