close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: ఆ అబ్బాయితో ఏంటలా.. సిరికి తల్లి వార్నింగ్, హర్టయిన షణ్ముఖ్‌

Friday, November 26, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: ఆ అబ్బాయితో ఏంటలా.. సిరికి తల్లి వార్నింగ్, హర్టయిన షణ్ముఖ్‌

బిగ్‌బాస్ 5 తెలుగు తుది అంకానికి చేరుకుంది. దీంతో ఇప్పటి వరకు వీడియోలు, ఆడియో, లెటర్స్ ద్వారా ఇంటి సభ్యులకు వారి ఫ్యామిలీ మెంబర్స్‌ను టచ్‌లో ఉంచిన బిగ్‌బాస్ ఇప్పుడు ఏకంగా వాళ్లని హౌస్‌లోకి రప్పిస్తున్నారు. నిన్న కాజల్ భర్త, కూతురిని సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్‌బాస్ ఇవాళ కూడా అలాగే చేశాడు. శ్రీరామ్ చెల్లెలు, మానస్ , సిరి, సన్నీ తల్లి హౌస్‌లో సందడి చేశారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ఆ అబ్బాయితో ఏంటలా.. సిరికి తల్లి వార్నింగ్, హర్టయిన షణ్ముఖ్‌

షో ప్రారంభమైన వెంటనే .. తన భర్త విజయ్ ‌బిగ్‌హౌస్‌కి వచ్చి వెళ్లడంతో కాజల్ చాలా సంతోషంగా ఉంది. దీని గురించి ఆమె ఇంటి సభ్యులతో తన ఆనందాన్ని పంచుకుంది. దీనికి ఆయన నీలా కాదంటూ సన్నీ, మానస్‌‌లు కాజల్‌పై పంచ్‌ వేశారు. ఇక శ్రీరామ్, రవిలకు తన భర్త ఇచ్చిన ఝలక్‌‌ని కాజల్.. మానస్, సన్నీలతో షేర్ చేసుకుంది. మీ ఫ్రెండ్‌ని మీరు కాపాడుకోలేకపోయారని అన్నట్టుగా వాళ్లతో చెప్పింది. అటు శ్రీరామ్, రవిలు కూడా ఇదే విషయంపై చర్చించుకున్నారు. కాజల్ భర్త హౌస్ నుంచి వెళ్తూ వెళ్తూ శ్రీరామ్‌ని ఉద్దేశించి గొడవల్ని పరిష్కరించుకోమని సలహా ఇచ్చాడు. చివరికి ఈ విషయాన్ని కూడా రవి స్ట్రాటజీతో ఆలోచించాడు. అతను తన భార్యకి సపోర్ట్ చేయడానికి వచ్చాడని.... కాజల్ టాప్ 1లో ఉంటే.. నువ్ బాగానే ఆడుతున్నావ్ అలాగే ఆడు అని చెప్తాడు. కానీ.. ఒకరి పేరు మెన్షన్ చేసి అతనితోనే గొడవలు తగ్గించుకోమని చెప్పాడంటే.. నీకు మ్యాటర్ అర్థమైందా? అని రవి వ్యాఖ్యానించారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ఆ అబ్బాయితో ఏంటలా.. సిరికి తల్లి వార్నింగ్, హర్టయిన షణ్ముఖ్‌

ఇక ఫ్యామిలీ ఎపిసోడ్ లో భాగంగా గురువారం హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీరామ చెల్లెలు అశ్విని. వచ్చి రావడంతోనే సోదరుడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. నీ అభిప్రాయం నువ్ చెప్పు కానీ.. ఎదుటివాళ్లు చెప్పేది కూడా విను. ఎందుకు ప్రతి విషయాన్ని అంత సాగిదీస్తావ్ అంటూ కామెంట్ చేసింది. మాటల సందర్భంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన యానీ మాస్టర్ ప్రస్తావన రావడంతో ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావ్ అని అశ్విని చెప్పింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: ఆ అబ్బాయితో ఏంటలా.. సిరికి తల్లి వార్నింగ్, హర్టయిన షణ్ముఖ్‌

ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులతో ఫ్రీజ్ అండ్ రిలాక్స్ గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో సన్నీ .. రవి ఫ్రీజ్‌లో ఉన్నపుడు ఐస్ గడ్డ పెడుతూ ఆడుకున్నాడు. శ్రీరామ్ చెల్లెలు వచ్చి వెళ్లిన తర్వాత మానస్‌ తల్లి పద్మిని వచ్చారు. మానస్ ఎంత కామ్ గా ఉంటాడో అందుకు పూర్తి విరుద్ధంగా వున్నారామె. వచ్చి రావడంతోనే ఇంట్లో గెంతులు వేశారు. ప్రియాంక మానస్ గేమ్‌ని డిస్ట్రబ్ చేస్తుందన్న విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా అతనికి అర్థమయ్యేట్టుగా చెప్పింది పద్మిని. నా కొడుక్కి పెళ్లిళ్లు చేస్తావా? ఏంగేజ్ మెంట్‌లు చేస్తావా? అని రవిపై సెటైర్లు వేసింది. షణ్ముఖ్ నువ్ నాకు హగ్ ఇవ్వు.. నేను వెళ్లి ఆ హగ్‌ని దీప్తికి ఇచ్చేస్తా అని జోకులు వేసింది. శ్రీరామ్ స్పందిస్తూ... ఆంటీ మీరు ఇక్కడే ఉండండి అంటే.. ఆంటీ అంటావ్ ఏంటి? అక్క అని అనండి అనడంతో వెంటనే రియాక్టైన శ్రీరామ్ ... మీరు ఏజ్ తగ్గించుకోవల్సిన అవసరం లేదు.. ఇప్పుడు కూడా హాట్‌గానే ఉన్నారంటూ పంచ్ వేశాడు. ఆ తరువాత మానస్‌కి, నాకు మీలాంటి అమ్మాయిని చూడండి పెళ్లి చేసుకుంటామ్ అని శ్రీరామ్ అనగా.. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేస్తాలే అని అంటూ .. నీకోసం బయట హమీదా వెయిటింగ్ ఏమో అని పంచ్ వేసింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: ఆ అబ్బాయితో ఏంటలా.. సిరికి తల్లి వార్నింగ్, హర్టయిన షణ్ముఖ్‌

పద్మిని తర్వాత ఇంట్లోకి వచ్చిన సిరి తల్లి శ్రీదేవి...ఆట బాగా ఆడుతున్నావ్ అని కూతురిని ప్రశంసించింది. అదే సమయంలో షణ్ముక్‌ని మాటి మాటికి హగ్ చేసుకోడం బాలేదని హెచ్చరించింది. దీంతో ఫీలైన సిరి అందరి ముందూ అలా చెప్పడం సరికాదంది. తండ్రి లేని పిల్ల కదా, తండ్రిలాగా, అన్నయ్యలాగా, ఫ్రెండ్ లాగా హెల్ప్ చేస్తుంటే దగ్గరయిపోయింది అంటూ మాట్లాడింది. ఆ తర్వాత దీనిపై రియాక్టైన షణ్ముక్.. తల్లిగా ఆ ఫీలింగ్ ఉండడం తప్పులేదని ... తన కుటంబ సభ్యులను కూడా ఇంట్లోకి పంపించండి అంటూ వేడుకున్నాడు. అయితే తల్లి వద్దని చెప్పినా ఆమె అటు వెళ్లగానే సిరి వెళ్లి షణ్ముక్‌ మళ్లీ హగ్ చేసుకుంది. షన్నూ మాత్రం ఆమెను పట్టించుకోలేదు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ఆ అబ్బాయితో ఏంటలా.. సిరికి తల్లి వార్నింగ్, హర్టయిన షణ్ముఖ్‌

ఆ తర్వాత మానస్, ప్రియాంక మధ్య డిస్కషన్ జరుగుతుంది. తనను ఎందుకు దూరం పెడుతున్నావ్ అని ప్రియాంక ప్రశ్నించగా.. మానస్ స్సందిస్తూ నేను మామూలుగానే ఉన్నాను అని బదులిచ్చాడు. నీకు అనవసరంగా చనువు ఇచ్చాను. నువ్వు నా నుంచి ఇంకేదో ఆశిస్తునావు అని మండిపడతాడు. దీంతో ప్రియాంక మనసు ముక్కలవుతుంది. తర్వాత వచ్చిన సన్నీ మదర్ కళావతి కూడా హౌస్ మేట్స్‌తో చాలా సరదాగా వుంటారు. బిగ్‌బాస్ హౌస్‌ని చూస్తూ ఇక్కడికి రావడం తన అదృష్టమని... ఇక్కడే పుట్టినరోజు కూడా చేసుకోవడంతో హౌస్ మేట్స్ అందరూ ఫుల్ హ్యాపీ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.