'మ‌హా స‌ముద్రం' నుంచి 'హే రంభ‌...' సాంగ్ రిలీజ్‌

  • IndiaGlitz, [Saturday,August 07 2021]

ఓ సినిమాకు సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డ‌మ‌నేది అరుదుగా జ‌రిగే విష‌యం. అలాంటి అరుదైన విష‌యాలు 'మ‌హా స‌ముద్రం' సినిమా అప్‌డేట్స్ విష‌యంలో జ‌రుగుతున్నాయి. అంద‌రిలో అంచ‌నాలు పెంచుతున్న ఈ సినిమా విడుద‌ల కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రామిసింగ్ యాక్ట‌ర్స్ శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది.

ఈ సినిమా మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా విడుద‌లైన చిన్న సాంగ్ ప్రోమోకు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. చైత‌న్య భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుంచి తొలి సాంగ్‌గా 'హే రంభ‌...' అనే పాట ప్రోమోను చూస్తే రెగ్యుల‌ర్ మాస్ నెంబ‌ర్ కాద‌నిపిస్తోంది. అలాగే ఎవ‌ర్‌గ్రీన్ హీరోయిన్‌కు ఇది ట్రిబ్యూట్‌గా తెర‌కెక్కించినట్లు అర్థ‌మ‌వుతుంది.

ఈ సాంగ్ బీట్ వింటుంటే సాధార‌ణ‌మైన స్పెష‌ల్ సాంగ్‌లా కూడా అనిపించ‌డం లేదు. స్పెష‌ల్ లుక్‌తో డాన్సింగ్ బీట్‌ను అందించారు మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఈ పాట‌లో క‌న‌ప‌డే, రంభ గ్లామ‌ర్ క‌టౌట్‌, బ్యాన‌ర్స్‌, ఫొటోలు చూస్తుంటే రంభ ఫ్యాన్స్ అసోసియేష‌న్ ఆమె పుట్టిన‌రోజు భారీ ఎత్తున సెల్ర‌బేట్ చేసే సంద‌ర్భంగా అనిపిస్తుంది. శ‌ర్వానంద్‌, జ‌గ‌ప‌తిబాబు ఈ ప్రోమోలో రంభ‌పై త‌మ ప్రేమాభిమానాల‌ను చూపిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అలాగే ఇద్ద‌రి లుక్స్ ప‌క్కా మాస్‌గా ఉంది. వారిద్ద‌రి డాన్స్ కూడా చాలా ఫ‌న్‌ను క్రియేట్ చేస్తుంది.

చైత‌న్య భ‌రద్వాజ్ ఈ పాట‌ను త‌న‌దైన స్టైల్లో డిఫ‌రెంట్‌గా పాడారు. భారీత‌నంతో రూపొందిన ఈ పాట‌ను భాస్క‌ర భ‌ట్ల రాసిన ఈ పాట‌కు జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న 'మ‌హా స‌ముద్రం'ను ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్స్‌. రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చైత‌న్య భ‌రద్వాజ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌, కొల్లా అవినాశ్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

నటీన‌టులు: శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, జ‌గ‌ప‌తిబాబు, అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ త‌దిత‌రులు

More News

ఒలంపిక్ మెడల్ తో హాకీకి పునర్వైభవం: పవన్ కళ్యాణ్

భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో పతకం సాధించి జాతీయ జెండా రెపరెపలాడేలా చేసింది.

రాజీ కుదరడంతో నిహారిక భర్త కేసు సుఖాంతం!

మెగా డాటర్ నిహారిక భర్త ఊహించని విధంగా వార్తల్లో నిలిచాడు.

'యమదొంగ'లా సన్నగా అయిపోతాడా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

బిగ్ డెసిషన్.. నాని 'టక్ జగదీష్' డైరెక్ట్ ఓటిటి రిలీజ్!

కోవిడ్ కారణంగా ప్రజలు కష్ఠాలు ఎదుర్కొంటున్నారు. సినిమారంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది.

నిహారిక భర్త చైతన్యపై పోలీస్ కంప్లైంట్.. అర్థరాత్రి న్యూసెన్స్, ఇంట్లో గొడవ!

మెగా డాటర్ కొణిదెల నిహారిక గత ఏడాది వ్యాపారవేత్త చైతన్యని పెళ్లి చేసుకుని వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.