కుమారికి మ‌రో ల‌క్కీ ఛాన్స్..

  • IndiaGlitz, [Saturday,November 28 2015]

డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మాత‌గా మారి తొలి ప్ర‌య‌త్నంగా అందించిన సినిమా కుమారి 21 ఎఫ్‌. ఈ చిత్రానికి చాలా మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్ నిర్మాత‌గానే కాకుండా క‌థ‌- స్ర్కీన్ ప్లే కూడా అందించ‌డం విశేషం. ఈ మూవీలో క‌థానాయిక‌గా న‌టించిన హెబ్బా ప‌టేల్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టు అద్భుతంగా న‌టించి మంచి పేరు సంపాదించుకుంది.

తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించిన ఈ అమ్మ‌డుకి తాజాగా మ‌రో ల‌క్కీ ఛాన్స్ వ‌చ్చింది. సుకుమార్ నిర్మాత‌గా మ‌రో మూవీ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా సుకుమార్ మేన‌ల్లుడు అశోక్ హీరోగా ప‌రిచ‌యం కానున్నాడు. ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా హెబ్బా ప‌టేల్ నే ఫైన‌ల్ చేసాడ‌ట‌. దీంతో అమ్మ‌డు తెగ సంబ‌ర‌ప‌డిపోతుంద‌ట‌.

More News

ఆ డైరెక్ట‌ర్ తో రెండోసారి సినిమా చేస్తున్న రామ్..

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ కి శివ‌మ్ సినిమా స‌క్సెస్ ని అందించ‌లేక‌పోయింది. దీంతో ఎలాగైనా స‌రే విజ‌యం సాధించాల‌ని రామ్ హ‌రిక‌థ సినిమా చేస్తున్నారు.

​'సిద్ధార్ధ' యూనిట్ స‌మ‌క్షంలో నిర్మాత దాస‌రి కిర‌ణ్‌కుమార్ పుట్టిన‌రోజు వేడుక‌

బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర ద‌శ‌గా అడుగులు వేస్తున్న హీరో ఆర్‌.కె.నాయుడు. ఆయ‌న హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న తాజా సినిమా `సిద్ధార్థ‌`.

ర‌వితేజ స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్..

మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ఎవ‌డో ఒక‌డు. ఈ చిత్రాన్ని ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ తెర‌కెక్కిస్తున్నారు.

చైతు ప్రేమమ్ ప్రారంభమైంది...

యువ సమ్రాట్ నాగ చైతన్య మలయాళంలో విజయం సాధించిన ప్రేమమ్ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నవిషయం తెలిసిందే.

రాహుల్ తో నిత్యా...

‘అలా ఎలా’చిత్రంతో సక్సెస్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ తర్వాత మహేష్ సరసన ‘శ్రీమంతుడు’లో ఓ చిన్నపాత్రలో కనపడ్డాడు.