close
Choose your channels

ఆ డైరెక్ట‌ర్ తో రెండోసారి సినిమా చేస్తున్న రామ్..

Saturday, November 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ కి శివ‌మ్ సినిమా స‌క్సెస్ ని అందించ‌లేక‌పోయింది. దీంతో ఎలాగైనా స‌రే విజ‌యం సాధించాల‌ని రామ్ హ‌రిక‌థ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్నారు. హ‌రిక‌థ టైటిల్ ను నేను శైల‌జ గా మార్చ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 1న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా త‌ర్వాత రామ్..త‌న‌కి కందిరీగ సినిమా అందించిన సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. కందిరీగ కాంబినేష‌న్లో రూపొందే ఈ క్రేజీ మూవీని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ కుద‌ర‌క‌పోతే సొంత నిర్మాణ సంస్థ స్ర‌వంతి మూవీస్ సంస్థ నిర్మించ‌నున్నాయి. మ‌రి..కందిరీగ కాంబినేష‌న్ మ‌రో స‌క్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.