close
Choose your channels

చైతు ప్రేమమ్ ప్రారంభమైంది...

Saturday, November 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య మ‌ల‌యాళంలో విజయం సాధించిన ప్రేమ‌మ్ మూవీ తెలుగు రీమేక్ లో న‌టిస్తున్నవిష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని కార్తీకేయ్ ఫేం చందు మొండేటి తెర‌కెక్కిస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఈరోజు రామానాయుడు స్టూడియోలో ప్రారంభించారు.

అన్న‌య్య చైత‌న్య మూవీ ప్రారంభోత్స‌వానికి త‌మ్ముడు అఖిల్ హాజ‌ర‌య్యాడు. డిసెంబ‌ర్ 1 నుంచి వైజాగ్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. వైజాగ్ లో 22 రోజులు షూటింగ్ చేసిన త‌ర్వాత హైద‌రాబాద్ లో 5 రోజులు షూటింగ్ చేయ‌నున్నారు. ఆత‌ర్వాత గోవా, పొలాచ్చిలో దాదాపు 30 రోజులు షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని జులైలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.