బన్నీ లేకుండానే సినిమా తీసేస్తున్న సుకుమార్!

  • IndiaGlitz, [Thursday,December 26 2019]

సుకుమార్, బన్నీల కాంబో ఎప్పుడూ ఆసక్తికరమే. ఆర్య, ఆర్య2 సినిమాలతో తమది హిట్ కాంబినేషన్ అని నిరూపించుకున్నారు వీళ్లు. ముచ్చటగా మూడోసారి ఓ డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయ‌డంలో సందేహం లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌ పాత్రను పోషించబోతోన్నాడట. గత అక్టోబర్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ సినిమాకు సంబంధించిన పనుల్లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. బన్నీ లేకుండానే సుక్కూ.. తన సినిమా షూటింగ్ చకచకా కానిచ్చేస్తున్నాడని టాక్. కేరళలోని ఓ జలపాతం దగ్గర సీన్స్ షూట్ చేశారట. ఈ సీన్ సినిమాకే హైలెట్ అవుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. దీనికోసం సుకుమార్ టీమ్ చాలా వర్కవుట్స్ చేసిందని తెలిసింది. తెలుగులో బాహుబలి సినిమాతో జలపాతాలకు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఈ జలపాతం కూడా మంచి టాక్ అందుకుంటుందన్న నమ్మకంతో ఈ చిత్ర బృందం ఉంది. బన్నీ పాత్ర లేని ఎపిసోడ్‌లను ప్రస్తుతం చిత్రీకరిస్తూ.. ఆయన వచ్చాక ఫుల్ టైమ్ షూటింగ్ మొదలు పెట్టనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. 'రంగ‌స్థ‌లం' వంటి భారీ హిట్ త‌ర్వాత సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది.

More News

త్రివిక్రమ్, బన్నీల మధ్య చర్చోపచర్చలు.. ఏం తేలుస్తారో?

అల్లువారబ్బాయి అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘అల వైకుంఠపురములో’.

రాజమండ్రిలో 'ప్రతిరోజు పండగే' విజయోత్సవం

సాయి తేజ్ మరో డిఫరెంట్ హిట్ అందుకున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన "ప్రతి రోజు పండగే" సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది.

'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' ప్రీ రిలీజ్

'జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా' వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా,

వైజాగ్ కుర్రాళ్లకు ఆర్జీవీ అదిరిపోయే ఆఫర్..!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘నా రూటే సెపరేటు..

చియాన్ 58 టైటిల్‌.. ఈసారైనా స‌క్సెస్ ద‌క్కుతుందా?

చియాన్ విక్ర‌మ్ 58వ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. అంజ‌లి సీబీఐ ఆఫీస‌ర్(ఇమైకా నొడిగ‌ల్‌) ఫేమ్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.