close
Choose your channels

బన్నీ లేకుండానే సినిమా తీసేస్తున్న సుకుమార్!

Thursday, December 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బన్నీ లేకుండానే సినిమా తీసేస్తున్న సుకుమార్!

సుకుమార్, బన్నీల కాంబో ఎప్పుడూ ఆసక్తికరమే. ఆర్య, ఆర్య2 సినిమాలతో తమది హిట్ కాంబినేషన్ అని నిరూపించుకున్నారు వీళ్లు. ముచ్చటగా మూడోసారి ఓ డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయ‌డంలో సందేహం లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌ పాత్రను పోషించబోతోన్నాడట. గత అక్టోబర్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ సినిమాకు సంబంధించిన పనుల్లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. బన్నీ లేకుండానే సుక్కూ.. తన సినిమా షూటింగ్ చకచకా కానిచ్చేస్తున్నాడని టాక్. కేరళలోని ఓ జలపాతం దగ్గర సీన్స్ షూట్ చేశారట. ఈ సీన్ సినిమాకే హైలెట్ అవుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. దీనికోసం సుకుమార్ టీమ్ చాలా వర్కవుట్స్ చేసిందని తెలిసింది. తెలుగులో బాహుబలి సినిమాతో జలపాతాలకు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఈ జలపాతం కూడా మంచి టాక్ అందుకుంటుందన్న నమ్మకంతో ఈ చిత్ర బృందం ఉంది. బన్నీ పాత్ర లేని ఎపిసోడ్‌లను ప్రస్తుతం చిత్రీకరిస్తూ.. ఆయన వచ్చాక ఫుల్ టైమ్ షూటింగ్ మొదలు పెట్టనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. `రంగ‌స్థ‌లం` వంటి భారీ హిట్ త‌ర్వాత సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.