close
Choose your channels

చియాన్ 58 టైటిల్‌.. ఈసారైనా స‌క్సెస్ ద‌క్కుతుందా?

Wednesday, December 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చియాన్ 58 టైటిల్‌.. ఈసారైనా స‌క్సెస్ ద‌క్కుతుందా?

చియాన్ విక్ర‌మ్ 58వ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. అంజ‌లి సీబీఐ ఆఫీస‌ర్(ఇమైకా నొడిగ‌ల్‌) ఫేమ్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న కె.జి.య‌ఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. కాగా.. ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. లేటెస్ట్‌గా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఎస్‌.ఎస్‌.ల‌లిత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

పాత్ర ప‌రంగా, లుక్ పరంగానూ కొత్తగా చూపించే ప్రయత్నం చేసే నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. పాత్రలు, వాటి తీరు తెన్నులను పక్కన పెడితే విక్రమ్ హీరోగా సక్సెస్ కొట్టి చాలా కాలమే అయ్యింది. రీసెంట్‌గా విడుదలైన `మిస్టర్ కె.కె` బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. జయాపజయాలకు అతీతంగా నటనలో వైవిధ్యతను చూపిస్తున్న విక్రమ్‌కు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. కాగా త‌న 58వ‌ఈ చిత్రంలో విక్రమ్ 25 గెటప్స్‌లో కనపడబోతున్నారట. ఈ లుక్స్ కోసం అమెరికన్ కంపెనీ ఒకటి వర్క్ చేస్తుంది. ఈ సినిమాతో పాటు విక్ర‌మ్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాలోనూ న‌టిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.