"నా పేరు నంద గోపాల కృష్ణ. ప్రజలు నన్ను ఎన్ జి కె అని పిలుస్తారు"

  • IndiaGlitz, [Thursday,February 14 2019]

'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో రీసెంట్‌గా 'ఖాకి' వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు 'డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌','రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్' బ్యానర్ ల పై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం 'NGK' (నంద గోపాల కృష్ణ). ఈ చిత్రం టీీజర్ విడుదల చేశారు.

నా పేరు నంద గోపాల కృష్ణ. ప్రజలు నన్ను ఎన్ జి కె అని పిలుస్తారు అని సూర్య చెప్పే డైలాగ్ తో మొదలయ్యే టీజర్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠ రెపే లా ఉంది. సాయి పల్లవి చెప్పే గోపాలా పోరా నాన్నా నువ్వెళ్తే ఎలాంటి మురికైనా శుభ్రమవుతుంది అనే డైలాగ్ తో ఎన్ జి కె హై ఓల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ గా అలరించనుంది.

సింగం సూర్య తో జంటగా సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటించే ఈ చిత్రానికి సంగీతం : యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: జి.కె.ప్రసన్న, ఆర్ట్‌: ఆర్‌.కె.విజయ్‌ మురుగన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, దర్శకత్వం: శ్రీ రాఘవ

More News

'వెల్‌కం జింద‌గీ' టీజర్ విడుద‌ల‌

పిల్ల‌ర్ 9 ప్రొడ‌క్ష‌న్స్` బ్యానర్ పై    శ్రీ‌నివాస క‌ళ్యాణ్ - ఖుష్బూ పోద్దార్ ల‌ను హీరో హీరోయిన్‌లుగా ప‌రిచ‌యం చేస్తూ శాలు - ల‌క్ష్మ‌ణ్ ద‌ర్శ‌క‌త్వ లో రూపొందుతున్న  చిత్రం  `వెల్‌కం జిందగీ`.

'క‌థానాయ‌కుడు' న‌ష్టాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి

నందమూరి బాల‌కృష్ణ త‌న తండ్రి, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను రెండు భాగాలుగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

పార్టీ మారడానికి సిద్ధమైన టీడీపీ ఎంపీ!

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతలు జంపింగ్‌‌లు షురూ చేశారు. రోజురోజుకు ప్రతిపక్ష వైసీపీ, జనసేనకు నేతలు క్యూ కడుతున్నారు.

జయరామ్ హత్యకేసు: శిఖాకు ఊహించని వ్యక్తి మద్దతు!

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికాలో ఎన్నారై చిగురుపాటి జయరామ్ ‌‌హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

స్క్రీనింగ్‌కు సేనాని గ్రీన్‌సిగ్నల్.. వడపోత కత్తిమీద సామే.!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడో,రేపో ఎన్నికల కోడ్ మొదలవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇవ్వడంతో పాటు, ప్రత్యేక హోదాపై ఢిల్లీలో పోరుబాట పట్టారు.