తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

  • IndiaGlitz, [Thursday,March 21 2019]

తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయబోయే పది మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో శాసనసభకు పోటీచేసి ఓడిన మాజీలు పలువురికి చోటు లభించింది. మరీ ముఖ్యంగా ఇటీవలే కాంగ్రెస్‌కు టాటాచెప్పి కమలం గూటికి చేరిన డీకే అరుణ మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం కన్ఫామ్ అయ్యింది. కాగా.. సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయను అధిష్టానం పక్కనపెట్టి ఆయన స్థానంలో కిషన్‌రెడ్డికి టికెట్టివ్వడం తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది.

తెలంగాణ లోక్ సభ అభ్యర్థులు..


1. కరీంనగర్ - బండి సంజయ్


2. నిజామాబాద్ - ధర్మపురి అరవింద్


3. మాల్కాజ్ గిరి - రామచందర్ రావు


4. సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి


5. మహబూబ్ నగర్ - DK అరుణ


6. నాగర్ కర్నూలు - బంగారు శృతి


7. నల్గొండ - గర్లపాటి జితేందర్ కుమార్


8. భోంగిర్ - PV శ్యాంసుందర్ రావు


9. వరంగల్ - చింతా సాంబమూర్తి


10. మహబూబ్ బాద్ - హుసేన్ నాయక్


కాగా.. ఇంకా ఏడు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ ఏడు స్థానాలకు పోటీ గట్టిగా ఉండటంతో శనివారం మధ్యాహ్నం లేదా.. సాయంత్రానికల్లా రెండో జాబితా వెలువడే అవకాశాలున్నాయి.

More News

సిట్టింగ్‌లకు షాక్: టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థులను గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. కాగా ముందుగా అనుకున్నట్లుగానే పలువురు సిట్టింగ్‌లకు కేసీఆర్ మొండిచేయి చూపారు.

ప్ర‌భాస్ మొద‌లెట్టేశాడుగా!

ప్ర‌భాస్ న‌యా చిత్రం హైద‌రాబాద్ షెడ్యూల్ గురువారం మొద‌లైంది. ఈ షెడ్యూల్ కోసం పూజా హెగ్డే హైద‌రాబాద్‌కు వ‌చ్చారు.

'చంద్రబాబుకు కులపిచ్చి, కులగజ్జి ఉంది' - పోసాని కృష్ణమురళి

ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి ప్రముఖ నటుడు, రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మీడియా మీట్ నిర్వహించిన ఆయన చంద్రబాబుపై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన పీవీపీ!

'ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్' అని విజయవాడ వైసీపీ అభ్యర్థి, ప్రముఖ బిజినెస్‌మెన్ పొట్లూరి వరప్రసాద్‌ మాట్లాడిన మాటలను కట్ కట్ చేసి సోషల్ మీడియాలో, టీవీ చానెళ్లలో

జేడీ వ‌చ్చారు కాబ‌ట్టి వైసీపీ ఇక రాదు!

"క్రిమిన‌ల్ నాయ‌కుల భ‌ర‌తం ప‌ట్టేందుకే విశాఖ‌ప‌ట్నం పార్లమెంటు స్థానం నుంచి ఆయ‌న్ని నిల‌బెట్టాం. మాజీ జేడీ వ‌చ్చారు కాబ‌ట్టి వైసీపీ ఇక రాదు. వైసీపీని గెలిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా.