ఆ హీరో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు...

  • IndiaGlitz, [Sunday,May 26 2019]

వ్యోమ‌గామి రాకేశ్‌ శ‌ర్మ బ‌యోపిక్ 'సారే జ‌హాసే అచ్చా'. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ న‌టిస్తాడ‌ని అనుకున్నారు. చివ‌ర‌కు షారూక్ చేతికి ప్రాజెక్ట్ వెళ్లింది. అయితే ఆయ‌న కూడా త‌ప్పుకున్నాడు. ర‌ణ‌వీర్ సింగ్‌, ర‌ణ‌భీర్ క‌పూర్‌, రాజ్‌కుమార్‌రావ్ ఇలా హీరోలంద‌రూ ఎందుక‌నో ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నారు. చివ‌ర‌కు 'యురి' ఫేమ్ విక్కీ కౌశ‌ల్ రాకేశ్ శ‌ర్మ‌క‌న‌ప‌డ‌తాడ‌ని అన్నారు. అయితే ఇప్పుడు విక్కీ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడ‌ట‌. ఎందుకంటే యురి' దేశ‌భ‌క్తికి సంబంధించిన సినిమా దీని త‌ర్వాత విక్కీ చేస్తోన్న‌ స‌ర్దార్ ఉద్ధ‌మ్ సింగ్ బ‌యోపిక్‌, త‌క్త్ ఇలా అన్ని వ్య‌క్తికి సంబంధించిన చిత్రాలు, బ‌యోపిక్స్‌. ఇక‌పై చేయ‌బోయే సినిమా జ‌న‌ర‌ల్‌గా ఉండాల‌నుకుని 'సారే జ‌హాసే అచ్చా' నుండి విక్కీ కూడా త‌ప్పుకున్నాడ‌ట‌. మ‌రిప్పుడు ఈ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌లు ఏం చేస్తారో చూడాలి.

More News

డ‌బ్బు, కులం కావాల‌ని నిరూపించారుగా! : మాధ‌వీల‌త‌

2019 ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి అంద‌రూ ప‌లు ర‌కాలుగా కామెంట్స చేసుకుంటున్నారు. విశ్లేష‌ణ‌లు, ఓదార్పులు జ‌రుగుతున్నాయి.

లారెన్స్ రాజీ ప‌డ‌తాడా?

బాలీవుడ్ సినిమా `లక్ష్మీబాంబ్‌` విష‌యంలో ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్‌, నిర్మాత‌ల‌కు మ‌ధ్య కాస్త వ్య‌వ‌హారం చెడింది.

కేసీఆర్‌తో జగన్ భేటీ.. గంటపాటు ఏం చర్చించినట్లు!?

వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

నాగ్‌కి అమ‌ల ప్రేమ‌లేఖ‌

ప్రేమ‌కు వ‌య‌సు లేదు. .. అవును నిజ‌మే! అని అంటున్నారు అమ‌ల అక్కినేని. త‌న భ‌ర్త హీరో నాగార్జున‌ను ఉద్దేశిస్తూ ఆమె ఓ ప్రేమ‌లేఖ‌ను రాసి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

నాతో మామూలుగా ఉండ‌దంటోన్న స‌మంత‌

గ్లామ‌ర్ పాత్ర‌ల‌ను ప‌క్క‌న పెట్టి పెర్ఫామెన్స్ పాత్ర‌ల‌తో స‌మంత స‌క్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది. ఇప్ప‌డు ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం 'ఓ బేబి'.