close
Choose your channels

ఆ మూవీని మెచ్చి.. ‘బాహుబలి’ని మరిచిన ట్రంప్!

Monday, February 24, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో కాలుమోపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గుజరాత్‌లోని మోతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావనకు తెచ్చారు. ముఖ్యంగా చాయ్ వాలా నుంచి ప్రధాని వరకూ మోదీ ఎదిగిన తీరు, భారత్‌లో ఉండే అపారమైన అవకాశాలు, భారతీయ పండుగలు, సాంస్కృతి సంప్రదాయాలు, భారత మహిళల పనితీరు.. వీటితో పాటు మరీ ముఖ్యంగా ఇప్పటి వరకూ భూ మండలి ఎవరి దగ్గర లేని.. ఎవరూ తయారు చేయలేని ఆయుధాలను ఇండియాకు ఇచ్చేందుకు గాను ఒప్పందాలు చేసుకుంటున్నామని అగ్ర రాజ్యాధినేత చెప్పుకొచ్చారు.

షారూక్ సినిమా నచ్చింది!
ఇదే క్రమంలో భారతీయ సినిమాలు, క్రికెట్ స్టార్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీల గురించి కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంగా.. తనకు భారతీయ సినిమాలంటే ఇష్టమని చెప్పిన ఆయన ఒకట్రెండు సినిమా పేర్లు కూడా ప్రస్తావించారు. బాలీవుడ్ సినిమాలతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను మెచ్చుకున్నారు. భారతీయ సినిమాలు చాలా గ్రేట్ అన్న ఆయన..‘దిల్‌వాలే దుల్హానియా’, ‘షోలే’ చిత్రాలు చాలా గొప్పవని ప్రశంసల వర్షం కురిపించారు.

కాగా.. ‘దిల్‌వాలే దిల్హనియా లేజాంగే’ సినిమా ఆదిత్యా చోప్రా దర్శకత్వంలో తెరకెక్కగా.. షారుఖ్ ఖాన్, కాజోల్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా దాదాపు మహారాష్ట్రలోని బొంబాయిలోని మరాఠ మందిర్‌లో 10ఏళ్లకు పైగా ఏకధాటిగా ఆడి రికార్డు సృష్టించిందన్న విషయం విదితమే. అలాంటి చిత్రాన్ని ట్రంప్ ఈ వేదికపై ప్రస్తావించడం విశేషమని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. భారత్‌లో యేటా అన్ని భాషల్లో 2 వేలకు పైగా సినిమాలు రూపొందిస్తూ.. దేశ ఆర్ధిక ప్రగతిలో తనవంతు సహకారం అందిస్తోదని అగ్ర రాజ్యాధినేత తెలిపారు.

ఇలా మరిచిపోతే ఎలా ట్రంప్..!
ఇదిలా ఉంటే.. భారత్ పర్యటనకు వస్తున్నాని ట్రంప్ షెడ్యూల్ ఖరారైంది మొదలుకుని ఇవాళ ఉదయం వరకూ నెట్టింట్లో ఎక్కడ చూసినా ‘బాహుబలి’ని పోలిన చిత్రాలే దర్శనమిచ్చాయి. ఇదంతా ఒక ఎత్తయితే ‘బాహుబలి’ ఫైట్ సీన్‌కు సంబంధించిన యానిమేషన్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ బదులుగా మార్ఫింగ్ చేసి ట్రంప్‌ను సెట్ చేసిన వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. అంతేకాదు ఈ వీడియోను ట్రంప్ కూడా రీ ట్వీట్ కూడా చేశారు. అయితే.. రీట్వీట్‌లు సరే.. బాలీవుడ్ సినిమాను పొగిడారు సరే.. కనీసం ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా గురించి కనీస ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ సినిమా ప్రస్తావన లేకపోయే సరికి బాహుబలి ట్రంప్ వీడియోలను పోస్ట్ చేసిన నెటిజన్లు ఇప్పుడు అదే నోటితో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

కాగా.. ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న ‘బహుబలి’ సినిమాతో టాలీవుడ్ సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి తెలియజేసిన సంగతి తెలిసిందే. బహుశా ఇవాళ ట్రంప్ నోట ‘బాహుబలి’ సినిమా పేరు వచ్చుంటే మాత్రం ఇక తెలుగు సినిమా ప్రియులు, తెలుగు సినీ ఇండస్ట్రీలో హర్షాతిరేకాలు వచ్చేయేమో.!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.