close
Choose your channels

వాల్మీకి... ఆల్రెడీ హిట్టా?

Tuesday, September 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వాల్మీకి... ఆల్రెడీ హిట్టా?

వాల్మీకి ఆల్రెడీ హిట్ అయిందా? ఫుల్ లాభాల్లో ఉందా? అందుకే ఆ టీమ్ అంత ధీమాగా క‌నిపిస్తోందా? అవున‌నే అంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన సినిమా వాల్మీకి. అధ‌ర్వ ముర‌ళి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాడు. ముకుంద త‌ర్వాత వ‌రుణ్ ప‌క్క‌న పూజా న‌టిస్తోంది. ఆల్రెడీ ఈ జంట మీద శోభ‌న్‌బాబు, శ్రీదేవి హిట్ సాంగ్ వెల్లువొచ్చి గోదార‌మ్మ‌ను యానాం ప‌రిస‌రాల్లో చిత్రీక‌రించారు. రిలీజైన పాట‌ల‌కు కూడా మంచి స్పంద‌నే వ‌స్తోంది. మ‌రో వైపు మొద‌టి నుంచీ వ‌రుణ్ ర‌గ్డ్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

`గ‌బ్బ‌ర్ సింగ్‌` రీమేక్‌తో రీమేక్‌లు బాగా చేస్తార‌ని, హిట్ క‌చ్చితంగా ఇస్తార‌ని పేరు తెచ్చుకున్నారు హ‌రీష్ శంక‌ర్‌. గ‌బ్బ‌ర్‌సింగ్‌తో బాబాయ్‌కి హిట్ ఇచ్చిన ఆయ‌న, ఇప్పుడు తాజాగా అబ్బాయికి కూడా హిట్ ఆల్రెడీ ఇచ్చేశార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

త‌మిళ చిత్రం జిగ‌ర్తాండ‌కు రీమేక్ ఈ సినిమా. సినిమా చూసిన ఇన్‌సైడ్ వ‌ర్గాలు కూడా సినిమా మీద పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. తొలిప్రేమ త‌ర్వాత అంత‌రిక్షం అని సైంటిఫిక్ స్పేస్ సినిమా చేసిన వ‌రుణ్‌, ఈ ఏడాది ఎఫ్‌2 త‌ర్వాత చేస్తున్న ఇంకో ర‌కం చిత్ర‌మిది. మాస్ క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో సాగుతుంది. సంపూర్ణంగా ఇలాంటి గెట‌ప్పుతో సినిమా చేయ‌డం కూడా వ‌రుణ్‌కి ఇదే తొలిసారి.

ఈ చిత్రం ఇప్ప‌టికే నైజామ్‌లో రూ.7కోట్ల‌కు పైగా బిజినెస్ చేసింద‌ట‌. ఆంధ్ర‌లోనూ ఇదే స్థాయి బిజినెస్ జ‌రిగింద‌ట‌. థియేట్రిక‌ల్ రైట్స్ అనీ, డిజిట‌ల్ రైట్స్ అనీ అన్నీ క‌లుపుకుంటే ఇప్ప‌టికే రూ.25కోట్లు వ‌చ్చేసింద‌ట‌. సో సేఫ్ ప్రాజెక్ట్ అని టాక్‌.

ప్రొడ్యూస‌ర్ల‌కు సేఫ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా బ‌య్య‌ర్ల‌కు ఎలాంటి లాభాల‌ను మిగులుస్తుందో తెలుసుకోవాలంటే శుక్ర‌వారం వ‌ర‌కు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.