జ‌న‌వ‌రి 20న వ‌రుణ్ తేజ్ 'తొలి ప్రేమ‌' ఆడియో

  • IndiaGlitz, [Thursday,January 18 2018]

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మిత‌మ‌వుతున్న చిత్రం 'తొలిప్రేమ‌'. రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. యువ ద‌ర్శకుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేస్తున్నారు.

ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా పాట‌ల‌ను జ‌న‌వ‌రి 20న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ మాట్లాడుతూ - "కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌చ్చిన వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం 'తొలి ప్రేమ‌'. హృద‌యానికి హ‌త్తుకునే ప్రేమ‌క‌థ‌. వ‌రుణ్ తేజ్ కొత్త పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, నిన్నిలా నిన్నిలా చూశానే...అనే సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

త‌మ‌న్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్‌ను జ‌న‌వ‌రి 20న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నాం. అలాగే ఫిబ్ర‌వరి 9న సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

వ‌రుణ్ తేజ్‌, రాశిఖ‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈచిత్రానికి సంగీతంః ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: జార్జ్ సి.విలియ‌మ్స్‌.

More News

బాల‌య్య నిర్మాత‌గా.. బోయ‌పాటి చిత్రం?

న‌ట‌సింహ‌ నంద‌మూరి బాల‌కృష్ణ‌, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుందంటే.. బాక్సాఫీస్‌కి కొత్త ఊపు వ‌స్తుంది. సింహా, లెజెండ్.. ఇలా ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన రెండు సినిమాలు కూడా కాసుల గ‌ల‌గ‌ల‌లు వినిపించాయి.

ప్ర‌భాస్‌కి జోడీగా దీపికా ప‌దుకునే?

'బాహుబ‌లి' చిత్రాల‌తో..భార‌తీయ సినిమాపై చెర‌గ‌ని సంత‌కం చేశారు ప్ర‌భాస్‌. ఆ చిత్రాల సంచ‌ల‌న విజ‌యాల‌తో.. ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఇండియ‌న్ సినిమాగా నిలిచారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌.. సాహో అనే త్రిభాషా చిత్రాన్ని చేస్తున్నారు.

ఎన్టీఆర్ బ‌యోపిక్ టైటిల్ లోగో విడుద‌ల‌

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జీవిత చరిత్రలో సినిమాల నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎలా ఎదిగారనే ఓ అంశాన్ని తీసుకుని ..ఓ బయోపిక్‌ను రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

నాని సినిమాకి మంచి డీల్ కుదిరింది

ఒక‌టి కాదు రెండు కాదు.. వ‌రుస‌గా ఎనిమిది చిత్రాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యాల దండ‌యాత్ర చేశాడు యువ క‌థానాయ‌కుడు నాని. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో మొద‌లుపెట్టి.. గ‌త చిత్రం ఎం.సి.ఎ వ‌ర‌కు వ‌రుస విజ‌యాల‌తో జైత్ర‌యాత్ర సాగిస్తున్న ఈ యంగ్ టాలెంటెడ్ హీరో.. అతి త్వ‌ర‌లో కృష్ణార్జున యుద్ధంతో ప‌ల‌క‌రించ‌నున్నాడు.

బెల్లంకొండ‌కి జోడీగా కీర్తి సురేష్‌?

నేను శైల‌జ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌.. ఆ త‌రువాత నేను లోక‌ల్‌తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. అయితే.. తాజాగా వ‌చ్చిన ఆమె మూడో తెలుగు చిత్రం అజ్ఞాత‌వాసి ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఈ నేప‌థ్యంలో త‌న ఆశ‌ల‌న్నీ త‌దుప‌రి చిత్రం మ‌హాన‌టిపై పెట్టుకుంది.