బర్త్ డే కి న్యూ స్టైలిష్ లుక్ లో విక్టరీ వెంకటేష్

  • IndiaGlitz, [Saturday,December 12 2020]

ఎన్నో మరపురాని ఘన విజయాలను సాధించి 'విక్టరీ' నే తన ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్ దగ్గుబాటి జన్మదినం డిసెంబర్ 13. ప్రస్తుతం 'నారప్ప' గా పవర్ ఫుల్, ఇంటెన్స్ రోల్ లో కనిపిస్తున్న వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ ఈ రోజు (డిసెంబర్ 12) రాత్రి 8:00 గం లకు విడుదల చేయనున్నారు. 'నారప్ప' తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి 'F3' చేయనున్న విషయం తెలిసిందే.

కాగా ఈ పుట్టినరోజుకు వెంకటేష్ న్యూ ఫోటోషూట్ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ స్టిల్స్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో, గెడ్డంతో స్టైలిష్ గా వెంకీ అదరకొడుతున్నారు. ట్రేమెండస్ రెస్పాన్స్ వచ్చిన ఈ స్టిల్స్ కాజువల్ గా తీసినవే అని చెప్తున్నప్పటికీ, ఫ్యూచర్ లో రాబోయే ఫిల్మ్ లో ఖచ్చితంగా ఈ స్టైలిష్ లుక్ తో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకులను అభిమానులను అలరించనున్నారని తెలుస్తోంది. ఇంతకీ అది ఏ చిత్రంలో ఉంటుందో వెయిట్ అండ్ సీ...

More News

ఎట్టకేలకు ఆ హీరోయిన్‌కి బెయిల్‌ దొరికింది

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో వెలుగు చూసిన డ్రగ్స్‌ కోణంపై విచారణ చేపట్టిన నార్కోటిక్‌ అధికారులు సినీ రంగానికి చెందిన చాలా మందిని విచారించారు.

మందు బాబులకు షాక్.. కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే

కరోనా మహమ్మారిని నివారించడంలో భాగంగా ఇప్పడిప్పుడే ఒక్కొక్కటిగా వ్యాక్సిన్లు బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దాదాపు అన్ని వ్యాక్సిన్‌లకు సంబంధించిన ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి.

ప్రధానితో ప్రభాస్‌కు లింకేంటి?

'బాహుబలి'తో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన రెబల్‌స్టార్ ప్రభాస్‌ సాహో తర్వాత చేస్తున్న ప్యాన్‌ ఇండియా మూవీ 'రాధేశ్యామ్‌'. పీరియాడిక్‌ లవ్‌స్టోరిగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ జోడీగా

ఎట్టకేలకు ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

మూడు నెలల సుదీర్ఘ విరామానంతరం ఎట్టేకేలకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది.

స్టార్ డైరెక్ట‌ర్స్‌కి షాకిచ్చిన విజ‌య్‌..!

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ ఇప్పుడిప్పుడే త‌న సినిమాల‌కు తెలుగులో మార్కెట్‌ను క్రియేట్ చేసుకునే ప‌నిలో ఉన్నాడు.