స్టన్నింగ్ లుక్ కో్సం కష్టపడుతున్న వినాయక్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోలకు మాస్ ఇమేజ్ను అందించే దర్శకుల్లో ఒకరు వినాయక్. ఆయనే త్వరలో హీరోగా వెండితెరపై కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించబోయే ఈ చిత్రాన్ని నరసింహారావు అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వినాయక్ ఫిజిక్ గురించి ఎవరూ పట్టించుకోరు.
కానీ హీరోగా మారుతుంటే మాత్రం ఫిజిక్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిందే. కాబట్టి వినాయక్, బరువు తగ్గి ఫిట్‌గా కనపడటానికి జిమ్‌లో హార్డ్ వర్క్ చేస్తున్నారు. జిమ్‌లో కష్టపడుతున్న వినాయక్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడుతుంది. మరి దర్శకుడిగా మెప్పించిన వినాయక్ హీరోగా ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.