బాబుకు ఓటేస్తే ఆంధ్ర దేశం నాశనమైపోతుంది!

  • IndiaGlitz, [Monday,March 18 2019]

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు ఓటేస్తే 'ఆంధ్ర రాష్ట్రం కమ్మ రాష్ట్రం అయిపోతుంది.. ఆంధ్ర దేశం నాశనమైపోతుంది' అని టాలీవుడ్ నటుడు, డైరెక్టర్ పోసాని మురళీ కృష్ణ చెప్పుకొచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలారా.. ఎవడు దొంగో..'దొంగ' అనే చెప్పండి. ఎవడు లుచ్ఛానో  'లుచ్ఛా' అనే చెప్పండి. ఎవడు మంచోడో..‘మంచోడు’ అనే చెప్పండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని కులాలకు, మతాలకు ఒక్క మాట చెబుతున్నాను.

ఏ కులం వాడు కూడా ఇన్ క్లూడింగ్ 'కమ్మ'.. చంద్రబాబు అనే వాడికి ఓటు వేయొద్దు. అతనొక పెద్ద దొంగ.. అబద్ధాల మనిషి.. అవినీతిపరుడు. ఇంత కూడా విలువలు లేకుండా బతుకుతున్న మనిషి. చంద్రబాబుకు ఎవరైనా ఓటు వేస్తే, అది కమ్మ రాజ్యానికి, కమ్మ కులానికి, కమ్మ దేశానికి మాత్రమే ఓటేసినట్టే. మరొక్కసారి చంద్రబాబుకు మీరు ఓటేసి గెలిపించారంటే, ఆంధ్ర రాష్ట్రం కమ్మ రాష్ట్రం అయిపోతుంది. ఆంధ్ర దేశం నాశనమైపోతుంది’ అని కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు.

చిరు కుటుంబాన్ని తిట్టించి..

చంద్రబాబు ఏ కులాన్ని తిట్టకుండా వదిలిపెట్టలేదు. చిరంజీవి కుటుంబంలోని ఆడవాళ్లను కూడా చంద్రబాబు తన పార్టీ వాళ్లతో తిట్టించారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వల్లే గెలిచిన చంద్రబాబు.. ఈరోజున ఆయన్ని కూడా తిడుతున్నారు.’ఇది మంచి..ఇది చెడు’ అని చెబుతున్న పవన్ కల్యాణ్ ని అమ్మలక్కలతో తిట్టిస్తావా? నిన్ననే ప్రెస్ మీట్‌లో పనవ్ కల్యాణ్ బాధపడుతూ చెప్పాడు.

మొన్నటి దాకా మోదీ కాళ్లు పట్టుకుని, ఆయనకు శాలువా కప్పిన చంద్రబాబు, ఇప్పుడు, అదే మోదీని హీనంగా తిడుతున్నారు. నాడు సోనియా, రాహుల్ గాంధీలను తిట్టిన చంద్రబాబు, ఇప్పుడు వాళ్లను వాటేసుకుంటున్నారు అరని పోసాని వ్యాఖ్యానించారు. పోసాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, పోసాని ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.

More News

ఏపీ ఎన్నికల్లో టాలీవుడ్ హీరోయిన్ పోటీ

'నచ్చావులే' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మాధవీలత రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్న ఆమె 2019

హీటెక్కిస్తున్న దిశా....

లోఫ‌ర్ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన బ్యూటీ దిశా ప‌టాని.. త‌ర్వాత బాలీవుడ్‌కే ప‌రిమిత‌మైంది. బాఘి2లో త‌న‌తో న‌టించిన టైగ‌ర్ ష్రాఫ్‌తోనే డేటింగ్‌లో ఉంది దిశా ప‌టాని.

సామ్‌కి చైతు బోర్ కొట్టేశాడ‌ట‌...

రీల్ లైఫ్ నుండి రియ‌ల్ లైఫ్ భార్య‌భ‌ర్తలుగా మారిన అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు ఓ కార్య‌క్ర‌మంలో వారి వైవాహిక బంధం గురించి మాట్లాడుకున్న మాట‌లు ఇప్పుడు టాపిక్‌గా మారుతున్నాయి

9 లుక్స్‌లో అదర‌గొడుతున్నాడుగా...

ఒక్కొక్క సినిమాకు ఏదైనా కొత్త‌గా చేస్తేనే ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌గ‌లం. ముఖ్యంగా బ‌యోపిక్స్ చేసే స‌మ‌యంలో ఇలాంటి జాగ్ర‌త్త‌లు మ‌రీ ఎక్కువ‌గా తీసుకోవాలి.

18 ఏళ్ల త‌ర్వాత అవార్డ్‌

సాధార‌ణంగా నెటివిటీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న సినిమాల‌ను తెర‌కెక్కించిన సినీ చిత్ర సీమ‌ల్లో త‌మిళ సినీ ఇండ‌స్ట్రీ ఎప్పుడూ ఉంటుంది. గ‌త ఏడాది కోలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌