close
Choose your channels

ఆగస్ట్ నుండి 'భార‌తీయుడు 2' ప్రారంభం?

Monday, July 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆగస్ట్ నుండి భార‌తీయుడు 2 ప్రారంభం? 

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ... 23 ఏళ్ల ముందు `భార‌తీయుడు` సినిమా విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు దీనికి రూపొంద‌నున్న సీక్వెల్ సినిమాయే `ఇండియ‌న్ 2`. . లైకా ప్రొడ‌క్ష‌న్స్ సినిమాను నిర్మించ‌డానికి రెడీ అయ్యింది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి కొన్నిరోజులు చిత్రీక‌ర‌ణ జ‌రిగిన త‌ర్వాత డైరెక్ట‌ర్ శంక‌ర్‌, నిర్మాణ సంస్థ లైకాకు బ‌డ్జెట్ ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో సినిమాను ఆపేశారు.

శంక‌ర్ ఈ సినిమాను మ‌రో సంస్థ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు. చివ‌ర‌కు లైకా వ‌ద్ద‌కే ప్రాజెక్ట్ వ‌చ్చి ఆగింది. చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు శంక‌ర్ చేసేదేమీ లేక బ‌డ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. సినిమా ఆగ‌స్ట్ నుండి రీస్టార్ట్ అవుతుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.