మ‌హేష్‌తోనూ హిట్ కొడ‌తాడా?

  • IndiaGlitz, [Saturday,December 16 2017]

హే రామ్‌, క్రిష్ 3, 24 త‌దిత‌ర చిత్రాల‌తో ఛాయాగ్రాహ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ని చాటుకున్నారు సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ తిరున‌వుక‌ర‌సు. గ‌తేడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన జ‌న‌తా గ్యారేజ్‌తో తొలిసారిగా తెలుగు ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌య‌మయ్యారు తిరు. ఆ సినిమా త‌రువాత మ‌రే తెలుగు సినిమాకి సంత‌కం చేయ‌ని ఆయ‌న.. తాజాగా మ‌హేష్ బాబు, కొర‌టాల శివ సినిమాకి సంత‌కం చేశారు.

తొలుత ఈ సినిమాకి ర‌వి కె.వ‌ర్మ‌న్ కెమెరామేన్‌గా ప‌నిచేశారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌డంతో.. ఆ స్థానంలోకి తిరు వ‌చ్చారు. ఇప్ప‌టికే ఈ విష‌యంపై అధికారిక ప్ర‌క‌ట‌న‌లు కూడా వ‌చ్చాయి. కాగా, శ‌నివారం తిరు ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తెలియ‌జేశారు.

మ‌హేష్‌, కొర‌టాల సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంద‌ని.. ఈ విష‌యం తెలియ‌జేస్తున్నందుకు ఎగ్జ్టైట్ అవుతున్నాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. డిసెంబ‌ర్ 14 నుంచి త‌న వ‌ర్క్ స్టార్ట్ అయినట్లు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌తో హిట్ కొట్టిన తిరు.. త‌న రెండో తెలుగు హీరో మ‌హేష్‌తోనూ హిట్ కొడ‌తారేమో చూడాలి.

More News

'బ్ర‌హ్మాండ‌నాయ‌గ‌న్‌'గా 'ఓం న‌మో వేంక‌టేశాయ'

అన్న‌మ‌య్య‌, శ్రీ‌రామ‌దాసు, శిరిడి సాయి వంటి భ‌క్తిర‌స చిత్రాల త‌రువాత అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మ‌రో ఆధ్యాత్మిక చిత్రం'ఓం నమో వేంకటేశాయ'.

వారం గ్యాప్ లో నాగశౌర్య రెండు చిత్రాలు

యువ కథానాయకుడు నాగశౌర్య వచ్చే సంవత్సరం ఆరంభంలో రెండు సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

నాగ్ , నానిల మల్టీస్టారర్ పై క్లారిటీ వచ్చేసింది...

నాగార్జున,నాని కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందనుందనే సంగతి తెలిసిందే.

జనవరి 25న 'దండుపాళ్యం 3'

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన 'దండుపాళ్యం' తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయం సాధించి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది.

మస్కట్‌లో సాయిధరమ్‌తేజ్‌, వి.వి.వినాయక్‌, సి.కళ్యాణ్‌ చిత్రం పాటలు

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.