'యమపాశం' సీడెడ్ హక్కులు దక్కించుకున్న వారాహి

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]

చిన్న చిత్రాల‌ను ఎంక‌రేజ్ చేస్తూ వాటి విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించ‌డంలో వారాహి చ‌ల‌న చిత్రం ఎప్పుడూ ముందుంటుంది. వారాహిచ‌ల‌న చిత్రం అధినేత సాయికొర్ర‌పాటి మంచి కాన్సెప్ట్ ఉన్న చిన్న చిత్రాల‌ను చూసి వాటి హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు కైవ‌సం చేసుకుని గ్రాండ్ లెవ‌ల్ లో విడుద‌ల చేస్తున్నారు. గ‌తేడాది సూప‌ర్ హిట్ సాధించిన రాజుగారి గ‌ది', జ‌త కలిసే' చిత్రాల‌ను విడుద‌ల చేసిన సాయికొర్ర‌పాటి ఇప్పుడు యమపాశం' సినిమా సీడెడ్ హక్కులను ఫ్యాన్సీ ఆఫర్ తో చేజిక్కించుకున్నారు.

జయం రవి, లక్ష్మీమీనన్ జంటగా శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం మిరుథన్'. ఈ చిత్రాన్ని సినీ కార్న్ బ్యానర్‌పై తెలుగులో ల‌క్ష్మీ ప్ర‌స‌న్న నిర్మాత‌గా తెలుగులో య‌మ‌పాశం' పేరుతో విడుద‌ల చేస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లు రీసెంట్‌గా విడుద‌ల‌య్యాయి. ఈ పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. జాంబి థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం ఫిభ్ర‌వ‌రి 19న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల అవుతుంది. సౌంతిడియాలో జాంబి థ్రిల్లర్ గా విడుదలవుతన్న తొలిచిత్రమిదే కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

More News

మార్చి 4 న 5 సినిమాలు రిలీజ్

ఒకే రోజు రెండు మూడు సినిమాలు రిలీజ్ చేయ‌డానికే ఇష్ట‌ప‌డ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇప్పుడు ఒకే రోజు నాలుగైదు సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు.

సందీప్ కిషన్ నిత్యా మీనన్ 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రం టాకీ పూర్తి

'ప్రస్థానం' వంటి డిఫరెంట్ మూవీతో సినిమా రంగానికి పరిచయమైన యంగ్ హీరో సందీప్ కిషన్.'రొటీన్ లవ్ స్టోరి',వెంకటాద్రి ఎక్స్ ప్రెస్,బీరువా,టైగర్ వంటి విలక్షణమైన చిత్రాలతో మంచి సక్సెస్ లు సాధించారు.

మహేష్ మూవీకి బడ్జెట్ ఫిక్స్ చేసిన మురుగుదాస్..

సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

బాహుబలి రికార్డ్ ను క్రాస్ చేసిన ఎన్టీఆర్...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దర్శకథీర రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన బాహుబలి ఎంతటి సంచలనం సృష్టించిందో...ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

నాని డబుల్ 'ధమాకా'

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హీరో నాని ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.