close
Choose your channels

వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు షరతులు పెట్టిన జగన్!

Thursday, June 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు షరతులు పెట్టిన జగన్!

వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు షరతులు వర్తిస్తాయ్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు. గురువారం నాడు తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. స్పీకర్‌ అనగానే సోమ్‌నాథ్‌ ఛటర్జీ పేరు గుర్తుకొస్తుందన్నారు. స్పీకర్ ఎలా ఉండకూడదో గత ప్రభుత్వం నిరూపిస్తే.. స్పీకర్ ఎలా ఉండాలో ఈ ప్రభుత్వం ఆదర్శంగా ఉంటామన్నారు.

ఇదే చట్టసభలో విలువలు లేని గత ప్రభుత్వాలు చేసిన రాజకీయాలు చూశామన్నారు. ఇదే అసెంబ్లీలో విలువలు లేకుండా ప్రవర్తించిన తీరు చూశామన్నారు. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనీయని దిగజారిన వ్యవస్థను ఇదే చట్టసభలో చూశామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

అనర్హత వేటే..!
" గత ప్రభుత్వం లాగే.. నేను కూడా అలాగే చేస్తే ఇక మంచి అనేది ఎక్కడ ఉంటుంది. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా చర్యలు లేవు. ఐదుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. విలువలకు ఎలా పాతర వేశారో ఇదే సభలో చూశాం. చివరకు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే ఆ నిబంధనను కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మార్చారు. ఈ సభను చట్టానికి, రాజ్యాంగానికి సంబంధం లేని విధంగా మార్చారు.

ఫిరాయింపులపై చర్యలు తీసుకొని స్పీకర్‌ను ఇదే సభలో చూశాం. అలాంటి ప్రభుత్వంపై ప్రజలే అనర్హత వేటు వేశారు. దేవుడు స్క్రిప్ట్‌ రాస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఈ ఎన్నికలే నిదర్శనం. 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్న వారికి 23 సీట్లే వచ్చాయి. ముగ్గురు ఎంపీలను తీసుకున్న వారికి ముగ్గురు ఎంపీలే మిగిలారు" అని వైఎస్ జగన్ మరోసారి చెప్పుకొచ్చారు.

టీడీపీ నుంచి ఐదుగురిని లాక్కుంటే..!
"అన్యాయం చేస్తే శిక్ష ఎలా ఉంటుందో అన్నదానికి నిదర్శనంగా మనం ఇవాళ ఏకం అయ్యాం. టెండర్లలో అవినీతిని తొలగించి, అవినీతిరహిత రాష్ట్రంగా మార్చేందుకు మా ప్రభుత్వం మొదటి నుంచి పని చేస్తోంది. అందులో భాగంగానే స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఎన్నిక చేశాం. ఎలా ఉండాలో చెప్పడానికి ఈ సభ కంకణం కట్టుకుంది. బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌లు కాదు.. బ్యాక్‌ బోన్‌గా మార్చుతామని మా పార్టీ ఏలూరు సభలో చెప్పింది. అందులో భాగంగా మంత్రిమండలిలో ఏడుగురికి మంత్రిపదవులు ఇచ్చాం. ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమించాం.

మా కమిట్‌మెంట్‌ను నిరూపించుకుంటున్నాం. పార్లమెంట్‌ సాంప్రదాయాల విషయంలో దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాను. చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి ఐదుగురిని లాక్కుంటామంటున్నారు. అలా చేస్తే చంద్రబాబుకు.. నాకు తేడా ఉండదు. అలా తీసుకోవాల్సి వస్తే ఆ పదవికి రాజీనామా చేసిన తరువాతే తీసుకుంటాను. లేదంటే పార్టీ ఫిరాయించిన వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరుకుంటూ మరొకమారు స్పీకర్‌కు అభినందనలు తెలుపుతున్నాను" అని వైఎస్ జగన్ ఈ సందర్భంగా కండిషన్స్ పెట్టారు.

కౌంటర్లే కౌంటర్లు..!
కాగా.. ఈ సందర్భంగా ఇటు అధికార.. అటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు స్పీకర్‌ తమ్మినేనితో తమకున్న అనుబంధం గురించి సభాముఖంగా మాట్లాడారు. అంతేకాదు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. చంద్రబాబుపై కౌంటర్ల వర్షం కురిపించారు. మరోవైపు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సైతం చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.