'యాత్ర' మూవీ విషయంలో వైసీపీ ఫ్యాన్స్ ఓవరాక్షన్!

  • IndiaGlitz, [Monday,February 11 2019]

ఇదేంటి.. సినిమా చూసినోళ్లు ప్రోత్సహిస్తారు.. కిరాక్ అని చెబుతారు.. సూపర్ డూపర్ హిట్ అని చెబుతారు.. కానీ ఓవరాక్షన్ ఎందుకు చేస్తారు..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్న నిజమే. సినిమా చూసి పదిమందికి చెప్పి మీరు కూడా చూడమని చెబుతున్నారు.. ఇంత వరకూ ఓకే కానీ ఆ తర్వాత చేసే పనులే కాసింత ఓవరాక్షన్ అనిపిస్తున్నాయ్.! అసలు ఈ ఓవరాక్షన్ కథేంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా ఆర్టికల్ చదివేయండి మరి.

సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే నెట్టింట్లో ఫైరసీ ప్రత్యక్షమవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వెబ్‌‌సైట్లను నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ పరిస్థితులు మాత్రం మారట్లేదు. ఈ పైరసీ అనే వైరస్‌‌కు ఎప్పుడు ఇంజక్షన్ పడుతుందో ఏంటో ఎవరికీ తెలియని పరిస్థితి. తాజాగా.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌‌రెడ్డి పొలిటికల్ జర్నీలో కీలకమైన ‘పాదయాత్ర’ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా మహి వి. రాఘవ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’ మూవీ సైతం పైరసీకి గురైంది. దీంతో చాలా మంది థియేటర్లలోకి వెళ్లే సమయం, నాలుగు పైసలు మిగిలాయని ఆనందంతో సినిమా చూసి ఎంజాయ్ చేశారు.!

ఇక్కడి వరకూ ఓకే కానీ వైసీపీ వీరాభిమానులు అని చెప్పుకునే కొందరు ఈ సినిమాను పూర్తిగా డౌన్‌‌లోడ్ చేసి మూవీలోని కొన్ని సన్నివేశాలకు.. వైఎస్ రియల్‌‌ సన్నివేశాలను జోడించి ఐదు, పది నిమిషాలు ఇలా వీడియోలు చేసి నెట్టింట్లో పెడుతున్నారు. ఆ వీడియోలు చూసిన మరికొందరు ఫ్యాన్స్ దాన్ని షేర్ చేసుకుంటున్నారు.. ఇలా షేర్ల వర్షం కురుస్తోంది. ఏముంది ఇలా కూడా సినిమా ప్రమోట్ అవుతుంది కదా అనుకుంటున్నారా..? అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే మరి. ఇలా ఒక వీడియో కాదు.. ఒక 20, 25 వీడియోలు చేస్తే.. ఆ ఒక్కో వీడియో 5నుంచి 15 నిమిషాలు నిడివి ఉంటే పరిస్థితేంటి..? అప్పటికే దాదాపు సినిమా మొత్తం రివీల్ అయిపోతుంది కదా..! ఇలా చేయడం వల్ల ఎంత సినిమా జనాల్లోకి వెళ్తుంది..? ఎవరికి నష్టం వాటిల్లుతుంది..? దీని వల్ల నిర్మాతలు ఎంత నష్టపోతారు..? కొన్ని నెలల పాటు కష్టపడ్డ ఆర్టిస్ట్‌‌ల పరిస్థితేంటి..? అని ఒక్కసారైనా వెనుక ముందు ఆలోచించారా..? అంటే అస్సలు లేదు.

ఇలా ఒక్క యాత్ర సినిమా విషయంలోనే కాదు ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్‌‌ కథానాయకుడు, ఎన్టీఆర్ విషయంలోనూ జరిగింది. సో ఇలా చేయడం వల్ల నో యూజ్.. సినిమాకు వెళ్లండి.. చూసిన తర్వాత బాగుందని నాలుగు ముక్కలు నలుగురికి చెప్పండి మీకు తోస్తే సోషల్ మీడియాలోనూ మీ మిత్రులతో పంచుకోండి (వీడియోలు కాదు మాటలు) అంతే తప్ప ఇలా చేయడం సబబు కాదు.. సో ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయొద్దు.. చేసే వారిని ప్రోత్సహించకండి అని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More News

ఏపీ బాగుండాలంటే ‘సైకిల్‌‌’ను తొక్కాలి.. మర్చిపోరుగా!

గత కొన్ని రోజులుగా  ‘మై చానెల్ నా ఇష్టం’ అనే యూట్యూబ్ చానెల్ పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే నా కుటుంబం - సౌంద‌ర్య

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ త‌న కుమార్తె సౌంద‌ర్య వివాహం న‌టుడు, ఫార్మా కంపెనీ య‌జ‌మాని విశాగ‌న్‌తో గ్రాండ్‌గా జరిగింది.

నాగ్ చిత్రంలో అమ‌ల‌

అక్కినేని నాగార్జున ఇప్పుడు రెండు సినిమాలు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. అందులో ఒక‌టి `మ‌న్మ‌థుడు` సీక్వెల్ `మ‌న్మ‌థుడు 2`..

'యాత్ర' మూవీ చూసి కంటతడిపెట్టిన వైఎస్ విజయమ్మ

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌‌రెడ్డి పొలిటికల్ జర్నీలో కీలకమైన ‘పాదయాత్ర’ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా మహి వి. రాఘవ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’.

మోసపోవద్దు.. అన్న సీఎం అవుతాడని చెప్పండి!

"సీఎం చంద్రబాబు ఎన్నికల టైమ్‌‌లో ఇచ్చే మూడువేల రూపాయలకు మోసపోవద్దని కార్యకర్తలంతా ప్రతి  అమ్మకు, అక్కకు, చెల్లికి గట్టిగా చెప్పండి.