Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

'ఎవడు'తో శ్రుతి మరోసారి..

IndiaGlitz [Sunday, December 01, 2013]
Comments

కెరీర్ ప్రారంభంలో వరుస పరాజయాలను చవిచూసిన శ్రుతి హాసన్.. ఇప్పుడిప్పుడే విజయాలను సైతం అలవాటు చేసుకుంటోంది. 'గబ్బర్ సింగ్, బలుపు' చిత్రాలతో హిట్ ట్రాక్ లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే హ్యాట్రిక్ ఇస్తుందనుకున్న 'రామయ్యా వస్తావయ్యా' ఘోరంగా విఫలమవడంతో.. తన ఆశలన్నింటినీ 'ఎవడు'పైనే పెట్టుకుంది శ్రుతి. ఈ చిత్రమేమో అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ.. తన ఆశల పై నీళ్లు చల్లుతుండడంతో  కాస్తంత ఇబ్బందితనాన్ని ఫీలవుతోందీ అమ్మణ్ణి.

శ్రుతి ఎదురుచూపులకు తగ్గట్టుగా.. 'ఎవడు'ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ కన్ ఫర్మ్ చేసుకుంది. కాకపోతే ఈ ముహుర్తం వల్ల  శ్రుతికి మరో భయం పట్టుకుందట. అదేమిటంటే.. తెలుగులో తన కెరీర్ సంక్రాంతికి రిలీజైన 'అనగనగా ఓ ధీరుడు'తోనే మొదలైందని.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించని వైనం  'ఎవడు' కూడా ఎక్కడ వర్తిస్తుందోననట. ఓ సారి కలిసి రాని కాలం.. మరోసారైనా శ్రుతికి కలిసొస్తుందో లేదో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.




Sravanthi Movies Join Hands With Reliance Entertainment





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.