1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

భద్రమ్ సక్సెస్ మీట్

IndiaGlitz [Saturday, March 22, 2014]
Comments

శ్రేయాస్ మీడియా, పుష్యమి ఫిలిమ్ మేకర్స్, బి.రామకృష్ణారెడ్డి సంయుక్తంగా నిర్మించిన సినిమా 'భద్రమ్'. తమిళంలో 'తెగిడి'గా విడుదలై అక్కడి ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'భద్రమ్'గా తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా నటించిన ఈ సినిమాని పి.రమేష్ తెరకెక్కించాడు. ఇటీవల తెలుగులో విడుదలై మంచి విజయాన్నందుకున్న ఈ సినిమా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ 'తమిళంలో తెగిడి పేరుతో విడుదలై అక్కడి విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం ఇక్కడ కూడా మంచి హిట్ టాక్ తో ముందుకు వెళుతుంది. తెలుగులో ఈ సినిమా హక్కుల్ని మాకు ఇచ్చిన సి.వి.కుమార్ గారికి ధన్యవాదాలు.

శ్రీనివాస్ ధైర్యం చేసి ఈ సినిమా హక్కుల్ని చేక్కించుకోవడమే తొలి విజయం. తెలుగు ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందంగా ఉంది. హీరో క్యారెక్టర్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. నివాస్.కె.ప్రసన్న సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది' అని అన్నారు.

హీరో ఆశోక్ సెల్వన్ మాట్లాడుతూ 'సి.వి.కుమార్ బ్యానర్ లో నేను నటించిన మూడవ చిత్రం. తమిళంలో పెద్ద హిట్టయ్యింది. తెలుగులో కూడా పెద్దహిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. రమేష్ డైరెక్షన్, బ్యాగ్రౌండ్ స్కోర్, స్ర్కీన్ ప్లే అన్ని చక్కగా కుదిరాయి. ఆదివారం విజయవాడ, వైజాగ్ ఏరియాలకు సక్సెస్ టూర్ లకు వెళ్తున్నాం' అని అన్నారు.

Watch 'Bhadram' Trailers




Narendra Modi praises Pawan Kalyan





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.