Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

వరుసగా వస్తున్న క్రేజీ సినిమాలు

IndiaGlitz [Monday, April 23, 2012]
Comments

ఈ వేసవిలో ఒక దాని తర్వాత ఒకటిగా భారీ, క్రేజీ సినిమాలు వస్తున్నాయని గతంలోనే ఓసారి చెప్పుకున్నాం. అన్ని క్లాసుల పిల్లలకీ పరీక్షలైపోయి, వేసవి సెలవులు ఇచ్చేయడంతో ఇప్పుడు ఆ క్రేజీ సినిమాలన్నీ ఒకదాని వెంట ఒకటి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రాంచరణ్ 'రచ్చ' విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్టవగా, ఏప్రిల్ 27న ఎన్టీఆర్ 'దమ్ము' విడుదలవుతోంది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయగా, త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు సృష్టించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

మే నెలకి వచ్చేసరికి తొలిగా రవితేజ, తాప్సీ కాంబినేషన్ ఫిల్మ్ 'దరువు' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'శౌర్యం' ఫేం శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మాస్ ప్రేక్షకుల ఆదరణ బాగా పొందే అవకాశాలున్నాయి. అదే రోజు బాలకృష్ణ సినిమా 'అధినాయకుడు' కూడా వస్తుందని వినిపిస్తున్నప్పటికీ, నిర్మాత ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వస్తేనే అది విడుదలవుతుంది. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'దబాంగ్' రీమేక్ అయిన 'గబ్బర్ సింగ్' మీద పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. శ్రుతీ హాసన్ నాయికగా నటించిన ఈ సినిమా మే 11న విడుదల కానున్నది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించే సత్తా ఈ సినిమాకీ ఉంది.

ఇక 'ఈగ'ని హీరోగా చూపిస్తూ ఎస్.ఎస్. రాజమౌళి తీర్చిదిద్దిన 'ఈగ' సినిమా మే 30న రిలీజయ్యే అవకాశాలున్నాయి. నాని, సమంత, సుదీప్ నటించిన ఈ సినిమా గురించి 'అసాధారణ దర్శకుడు తీసిన అసాధారణ సినిమా'గా ప్రచారం జరుగుతోంది. కలెక్షన్ల పరంగా అద్భుతాలు సృష్టించే శక్తి ఈ సినిమాకి ఉంది. అలాగే రాం, తమన్నా జంటగా కరుణాకరన్ డైరెక్ట్ చేసిన 'ఎందుకంటే ప్రేమంట' సినిమా మే నెలాఖరున కానీ, జూన్ తొలి వారంలో కానీ విడుదల కావచ్చు. ఈ సినిమా పట్ల కూడా ట్రేడ్ వర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. వీటితో పాటు నాగార్జున 'డమరుకం', రవితేజ - పూరి జగనాథ్ ఫిల్మ్ 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలు జూలైలో వస్తాయని అంటున్నారు. సో... సినిమా ప్రియులకు రానున్న రెండు మూడు నెలల కాలం పండగేనని చెప్పాలి.
'జంజీర్' నిర్మాతకి నోటీసులుOther NEws

జంజీర్ నిర్మాతకి నోటీసులు

Read More »Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mahesh confirms his complete support to Galla Jayadev
 Sudeep - Jagapathi Babu's 'Bachchan' audio released
 Supreme Court Stays High Court order on Mohan Babu's 'Padma Shri' title Case
 ఏప్రిల్ 21న చరణ్ సెకండ్ షెడ్యూల్
 'బచ్చన్' ఆడియో ఆవిష్కరణ
 I don't agree with Allu Arjun : Shruti Haasan [Interview]
 రీమేక్ లో రాజశేఖర్
 Happy Birthday to Siddharth
 పాట మినహా పూర్తైన 'అంజాన్'
 Big schedule of "Govindudu Andari Vadele" from 21st

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.