Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ప్రియా ఆనంద్ కి బంపర్ ఆఫర్

IndiaGlitz [Friday, September 13, 2013]
Comments

'లీడర్' నాయికలలో ఒకరైన ప్రియా ఆనంద్ కి.. ఓ బంపర్ ఆఫర్ తగిలిందన్నది శాండిల్ వుడ్ నుంచి వస్తున్న సమాచారం. ఇప్పుడిప్పుడే తమిళంలో నాయికగా రాణిస్తున్న ఈ ఎన్నారై సోయగం అతి త్వరలో ఓ భారీ కన్నడ ప్రాజెక్ట్ లో నటించేందుకు అంగీకరించిందని వినిపిస్తోంది.

తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన దూకుడు సినిమాని కన్నడంలో రీమేక్ చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకి కె.మాదేశ్ దర్శకత్వం వహించనున్నారు. తెలుగులో స్వరాలు సమకూర్చిన తమన్ నే ఈ సినిమాకీ సంగీత దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే పాటల రికార్డింగ్ ని సైతం ప్రారంభించుకున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమా కోసం హీరోయిన్ గా పలువురు పరిశీలించి చివరాఖరికి ప్రియా ఆనంద్ ని ఖాయం చేసుకున్నారని కన్నడ చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.  ఇందులో ఎంతమేరకు నిజముందో అతి త్వరలోనే తెలుస్తుంది. ప్రియా ఆనంద్ ప్రస్తుతం తమిళంలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రాలలో 'వణక్కమ్ చెన్నై' వచ్చే నెల 11న విడుదల కానుండగా. ఇటీవలే రజనీకాంత్ తనయ ఐశ్వర్య దర్శకత్వంలో నటిస్తున్న 'వాయ్ రాజా వాయ్' (ఇందులో 'కడలి' హీరో గౌతమ్ కార్తీక్  కథానాయకుడు) ప్రారంభోత్సవం జరుపుకుంది. మరో రెండు సినిమాలు కూడా అమ్మడి చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దూకుడు రీమేక్ కూడా సదరు ముద్దుగుమ్మనే వరించడం చూస్తుంటే.. తన హవాకి టైం దగ్గర పడ్డట్టేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.




నయనతార సెంటిమెంట్



Priya Anand Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Write your own review on "Anaamika"
 'Naa Love Story Modalaindi' Gets Clean U
 'Naa Love Story Modalaindi' Releasing February End
 ఓ ప్రియా.. ప్రియా..
 Priya Anand To Romance GV Prakash
 జి.వి.ప్రకాష్ తో రొమాన్స్ కి సై..
 ప్రియాకి మరోసారి దక్కేనా?
 Priya Anand's '1234' (Andharu Engineerle) release on Apr 12th
 Ko Antey Koti 2nd Week Schedules
 KO ANTEY KOTI Overseas by MGM Arts Inc

Other News

 Happy Birthday Taapsee
 Suman compliments KCR's decision
 Sachin takes Vijayawada by Storm
 Sreenu Vaitla thanks Shruti Haasan
 Big shock for Samantha
 It is a big mistake by me : Suriya
 My role as a metal detector will be very interesting : Arvind Krishna [Interview]
 NTR-Puri Jagannadh movie launched at Cave
 Lakshmi Manchu's 'Budugu' First Look
 'Rabhasa' should become a super hit for him : NTR



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Happy Birthday Taapsee
 Suman compliments KCR's decision
 Sachin takes Vijayawada by Storm
 Sreenu Vaitla thanks Shruti Haasan
 Big shock for Samantha
 It is a big mistake by me : Suriya
 My role as a metal detector will be very interesting : Arvind Krishna [Interview]
 NTR-Puri Jagannadh movie launched at Cave
 Lakshmi Manchu's 'Budugu' First Look
 'Rabhasa' should become a super hit for him : NTR
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.