close
Choose your channels

Manchu Manoj:కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు.. అది శివుని ఆజ్ఞే : మౌనికతో ప్రేమ, పెళ్లి గురించి ఓపెన్ అయిన మనోజ్

Monday, March 6, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గత కొంతకాలంగా ప్రేమలో వున్న మంచు మనోజ్- భూమా మౌనికా రెడ్డిలు పెద్దల అంగీకారంతో మార్చి 3న ఒక్కటైన సంగతి తెలిసిందే. దీంతో నిన్న మనోజ్ తన అత్తారింటికి తొలిసారిగా వచ్చారు. అక్కడ పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయంలో వెంకటేశ్వరుడిని దర్శించుకుంది కొత్త జంట. ఈ సందర్భంగా మంచు మనోజ్.. తన ప్రేమ, పెళ్లి, ఇతర వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో మాట్లాడారు.

మౌనిక నా కోసం నిలబడింది:

జీవితంలో ఏదైనా ఓడిపోవచ్చు గానీ ప్రేమ ఓడిపోదని నమ్ముతున్నట్లు తెలిపారు. తన లైఫ్‌లో ప్రేమే గెలిచిందని.. నాన్న ఆశీస్సులు, అక్క మద్ధతుతో తామిద్దరం ఒక్కటయ్యామని మనోజ్ వెల్లడించారు. తనకు అండగా నిలిచి ఆశీర్వదించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇక తన పెళ్లి రోజు శివుడి ఆజ్ఞ అంటూ పెట్టిన పోస్ట్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు కూడా మనోజ్ ఆన్సర్ ఇచ్చారు. శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని.. మౌనిక తనకు 12 ఏళ్లుగా ఒక ఫ్రెండ్‌గా తెలుసునని ఆయన చెప్పారు. గత నాలుగేళ్లుగా తామిద్దరం ఒకరినొకరం అర్ధం చేసుకున్నామని.. ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ ధైర్యంగా నిలబడ్డామని మనోజ్ అన్నారు. నేను వేరే లోకంలో వున్నప్పుడు తానే నాకు అండగా నిలిచిందని.. దేవుడి ఆశీస్సులతో అంతా కలిసి తమ పెళ్లి చేశారని మనోజ్ పేర్కొన్నారు.

మౌనిక రాజకీయాల్లోకి వెళితే అండగా వుంటా :

ఇక మౌనిక కొడుకు ధైరవ్ రెడ్డి గురించి చెబుతూ.. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తారంటారు. బహుశా ఇదేనేమో అంటూ మనోజ్ చెప్పారు. ధైరవ్ బాధ్యతలను కూడా తానే తీసుకుంటున్నట్లు చెప్పారు. బాబు తన జీవితంలోకి రావడం కూడా శివుడి ఆజ్ఞగానే భావిస్తానపని మనోజ్ పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం తమ ఇద్దరికీ వుందని.. అయితే తనకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని, వాటిపై మౌనికకు ఇంట్రెస్ట్ వుంటే తాను అండగా నిలబడతానని మనోజ్ చెప్పారు. ఇక తన తదుపరి చిత్రం వాట్ ది ఫిష్ షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తున్నానని.. ఈ సినిమాకు వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టులో సినిమాను రిలీజ్ చేస్తామని మనోజ్ ప్రకటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.