close
Choose your channels

మహేష్ చిత్రంలో 'అల్లరి' నరేష్ పాత్రే పెద్ద ట్విస్ట్‌?

Wednesday, June 27, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహేష్ చిత్రంలో ‘అల్లరి’ నరేష్ పాత్రే పెద్ద ట్విస్ట్‌?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం) కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అగ్ర నిర్మాతలు అశ్వనీదత్, ‘దిల్’ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న‌ ఈ సినిమాలో ఉత్తరాది భామ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్నేహాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ శ్రీమంతుడుగా కనిపించనుండగా.. అతనికి ప్రాణ స్నేహితుడిగా ఓ పేదవాడి పాత్రలో ‘అల్లరి’ నరేష్ నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీలో నరేష్ పాత్ర చనిపోతుందట. ఆ పాత్ర చనిపోవడానికి గల కారణమేమై ఉంటుందన్నదే సినిమాలో కీల‌క‌మైన ట్విస్ట్ అని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమన్నది త్వ‌ర‌లోనే తెలుస్తుంది. కాగా.. చిత్రీకరణలో భాగంగా తొలి షెడ్యూల్‌ను డెహ్ర‌డూన్‌లో చిత్రీక‌రిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా 2019 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.