close
Choose your channels

చ‌ర‌ణ్‌పై బ‌న్నీ ఫ్యాన్స్ గుస్సా?

Sunday, February 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చ‌ర‌ణ్‌పై బ‌న్నీ ఫ్యాన్స్ గుస్సా?

మెగాస్టార్ చిరంజీవి స‌పోర్ట్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు డ‌జ‌ను హీరోలు ఆ ఫ్యామిలీ నుండి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇంత మంది హీరోల్లో అప్పుడ‌ప్పుడు గ్రూపు గొడ‌వ‌లు న‌డుస్తున్నాయంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఒక‌ప్పుడు వీరందరూ చిన్న‌వారు.. చిరంజీవే అంద‌రినీ ముందుండి న‌డిపించాడు. కానీ ఇప్పుడు అంద‌రూ పెద్ద‌వారు అయ్యారు. స్వతంత్ర్య నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. చిరంజీవి ముందు క‌లిసే ఉన్నా.. అప్పుడ‌ప్పుడు ఈ గొడ‌వ‌లు ఫ్యాన్స్ రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉంది. సోష‌ల్ మీడియాలో మెగా హీరోల అభిమానులే ఒక‌రిపై ఒక‌రు బుర‌ద చ‌ల్లుకుంటున్నారు. మాట‌ల యుద్ధం జ‌రుపుకుంటున్నారు. దీని గురించి మెగా హీరోలు ప‌ట్టించుకోవ‌డం లేదు. కొన్ని నెల‌లు క్రితం, ప‌వ‌న్‌-బ‌న్నీ ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు న‌డిచిన సంగ‌తి తెలిసే ఉంటుంది.

కాగా..ఇప్పుడు చ‌ర‌ణ్‌-బ‌న్నీ ఫ్యాన్స్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. అందుకు కార‌ణం అల వైకుంఠ‌పుర‌ములో స‌క్సెసే. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లో అతిపెద్ద విజయంగా నిలచింది. ఇప్పటికీ అల్లు అర్జున్ ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మునిగి తేలుతున్నాడు. అయితే.. బన్నీ భారీ విజయానికి ఇండస్ట్రీలో పలువురి నుంచి సపోర్టు లభించినా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చరణ్ నుంచి మాత్రం ఎలాంటి ప్రశంసలు అందలేదు. ప‌లువ‌రు యువ హీరోలు ఎన్టీఆర్‌, శ‌ర్వా వంటి వారు అల్లు అర్జున్‌ని, సినిమాను సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శసించారు. కానీ అల వైకుంఠ‌పుర‌ములో రిలీజ్‌కు ముందు పోస్ట్ చేసిన చ‌ర‌ణ్..సినిమా స‌క్సెస్ త‌ర్వాత ప‌ట్టించుకోలేదు. స‌రేలే! అనుకుంటే జాను సినిమాను మాత్రం అభినందిస్తూ చ‌ర‌ణ్ రీసెంట్‌గా పోస్ట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ఏదేమైనా చిరంజీవి మొదలుకొని చరణ్ వరకూ మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరూ 'అల.. వైకుంఠపురములో' విజయోత్సవాల్లో కనిపించింది లేదు. ఈ నేపథ్యంలో.. ఫ్యాన్స్ అంటున్నట్టు నిజంగానే చిరు-అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయా? అనే చ‌ర్చ మ‌ళ్లీ మొద‌లైంది. మ‌రి దీనిపై మెగా హీరోలు ఎలాంటి రిప్ల‌య్ ఇస్తారో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.