మ‌రో డిఫరెంట్ సినిమాతో ఆనంద్ దేవ‌ర‌కొండ‌..!

  • IndiaGlitz, [Friday,January 29 2021]

విజ‌య్ దేవ‌ర‌కొండ కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మ‌రో హీరో ఆయ‌న సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. తొలి చిత్రం దొర‌సానితో న‌టుడిగా మంచి మార్కుల‌ను సంపాదించుకున్న ఆనంద్ దేవ‌ర‌కొండ వైవిధ్య‌మైన సినిమాల‌ను ఎంపిక చేసుకుంటున్నాడు. గ‌త ఏడాది ఓటీటీలో విడుద‌లైన మిడిల్‌క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి హిట్‌ను సొంతం చేసుకున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. ఆ వెంట‌నే సినిమాలు చేసేయాల‌ని ఆలోచ‌న‌ల‌తో కాకుండా మంచి స్క్రిప్ట్స్‌పై ఫోక‌స్ పెడుతున్నాడు. అందులో భాగంగా రీసెంట్‌గా ఓ థ్రిల్ల‌ర్ సినిమాలో ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించ‌డానికి ఓకే చేశాడ‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

వివ‌రాల మేర‌కు... ఆనంద్ దేవ‌ర‌కొండను డైరెక్ట‌ర్ కె.వి.గుహ‌న్ క‌లిసి ఓ థ్రిల్ల‌ర్ క‌థ‌ను వినిపించాడ‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో ఆనంద్ దేవ‌ర‌కొండ సినిమాలో న‌టించ‌డానికి ఓకే చెప్పాడ‌ని టాక్. ఓ బేబీ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన నిర్మాత‌లు డి.సురేష్‌బాబు, సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ఫైన‌ల్ వెర్ష‌న్ రెడీ అవుతుంది. అది రెడీ అయిన త‌ర్వాత సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను స్టార్ట్ చేస్తార‌ని స‌మాచారం.

More News

బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ?

తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకునేలా బీజేపీ అడుగులు వేస్తోంది. అటు దుబ్బాక..

యువతకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాం: నాదెండ్ల మనోహర్

బీజేపీ, జనసేన కీలక నేతలు నేడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు.

‘గని’ జూలై 30న రిలీజ్

మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ ‌2న `సీటీమార్` విడుద‌ల

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’.

బిగ్‌బాస్ సీజన్ -5కి సన్నాహాలు..? ఊహాగానాలు స్టార్ట్..

‘బిగ్‌బాస్’ షో అనగానే ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆ షో ప్రారంభమవుతుందన్న వార్త వినిబడితే చాలు..