close
Choose your channels

బిగ్‌బాస్ సీజన్ -5కి సన్నాహాలు..? ఊహాగానాలు స్టార్ట్..

Thursday, January 28, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘బిగ్‌బాస్’ షో అనగానే ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆ షో ప్రారంభమవుతుందన్న వార్త వినిబడితే చాలు.. అప్పటి నుంచి క్రేజ్ పెరిగిపోతుంది. కంటెస్టెంట్‌లెవరూ.. హోస్ట్ ఎవరూ అంటూ రకరకాల ఊహాగానాలు ప్రారంభమవుతాయి. త్వరలో బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభం కానుందని టాక్. ఏప్రిల్ లేదా మే నెలలో సీజన్ 5ని ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు, హోస్ట్‌పై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. అయితే బిగ్‌బాస్ సీజన్ 3.. వరకూ ఒక లెక్క.. సీజన్ 4 ఒక లెక్క అంటున్నారు ప్రేక్షకులు. దీనికి కారణం లేకపోలేదు. సీజన్ 3 వరకూ దాదాపు వచ్చిన కంటెస్టెంట్‌లంతా ప్రేక్షకులకు బాగా తెలిసిన వారే. అయితే సీజన్ 3 వరకూ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌లకు ఆ తర్వాత ఆ షో ఏమాత్రం కలిసి రాలేదు.

కొందరైతే అంతకు ముందున్న ఇమేజ్‌ను కూడా డ్యామేజ్ చేసుకుని బయటకు వచ్చారు. కెరీర్ పరంగా కూడా దారుణంగా దెబ్బతిన్నారు. దీంతో బిగ్‌బాస్ షో అంటేనే భయపడిపోయారు. కానీ సీజన్ 4కి వచ్చేసరికి సీన్ మారిపోయింది. కంటెస్టెంట్లలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారంతా ఎవరికీ తెలియని వారే. దీనికి కూడా కారణం లేకపోలేదు. సీజన్ -3 వరకూ బిగ్‌బాస్ షో కంటెస్టెంట్లు ఎవరికీ కలిసి రాకపోవడంతో సీజన్ -4లో పాల్గొనేందుకు కంటెస్టెంట్లు భయపడినట్టు తెలుస్తోంది. అందుకే నిర్వాహకులు అంతా కొత్త మొహాలతో నెట్టుకు రావల్సి వచ్చింది. అయితే సీజన్ 4 మొదట ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత మాత్రం ఈ షో అద్భుతమైన రేటింగ్స్‌తో ముందుకు సాగింది. ఇక గ్రాండ్ ఫినాలే అయితే చెప్పనక్కర్లేదు. ఈ ఎపిసోడ్‌కి హ‌య్యెస్ట్ రేటింగ్ వ‌చ్చింది. అది మొత్తం బిగ్‌బాస్ హిస్ట‌రీలోనే హ‌య్యెస్ట్ కావ‌డం విశేషం.

ఇక షో పూర్తైనప్పటి నుంచి బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఎలాంటి ఎక్స్‌పెక్టేష‌న్స్ లేకుండా వెళ్లిన ప‌లువురు ఆ త‌రువాత మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నారు. ఇందులో పాల్గొన్న సొహైల్, మోనాల్ అయితే బాగా బిజీ అయిపోయారు. మెహ‌బూబ్, దివి, స్వాతి దీక్షిత్‌ల‌కు కూడా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అలాగే మిగిలిన వారికి కూడా ఆఫ‌ర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా సీజ‌న్ 4 బిగ్‌బాస్ స‌మీక‌ర‌ణాల‌ను మార్చ‌డంతో ఇప్పుడు ఐదో సీజ‌న్‌లో పాల్గొనేందుకు ప‌లువురు ఆస‌క్తిని చూపుతున్నట్టు‌. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు సైతం బిగ్‌బాస్ 5లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. మ‌రి బిగ్‌బాస్ 5 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్లు, హోస్ట్ గురించి తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.