18 ఏళ్ల త‌ర్వాత అవార్డ్‌

  • IndiaGlitz, [Monday,March 18 2019]

సాధార‌ణంగా నెటివిటీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న సినిమాల‌ను తెర‌కెక్కించిన సినీ చిత్ర సీమ‌ల్లో త‌మిళ సినీ ఇండ‌స్ట్రీ ఎప్పుడూ ఉంటుంది. గ‌త ఏడాది కోలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను న‌మోదు చేసుకున్న చిత్రాల్లో '96' సినిమా ఒక‌టి. విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి సి.ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌కుడు. ఈ '96' సినిమాకు ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

తాజాగా ఈ సినిమా ద‌ర్శ‌కుడు సి.ప్రేమ్‌కుమార్‌కు గొల్ల‌పూడి శ్రీనివాస్ అవార్డ్ ద‌క్కింది. ఆగ‌స్ట్ 12న జ‌ర‌గ‌బోయే 22వ‌ గొల్ల‌పూడి శ్రీనివాస్ అవార్డుల కార్య‌క్ర‌మంలో ల‌క్ష‌న్న‌ర రూపాయ‌ల న‌గ‌దు, మెమొంటోను ద‌ర్శ‌కుడికి అంద‌చేస్తున్నారు.

గొల్ల‌పూడి మారుతీరావు ప్ర‌మాదంలో చ‌నిపోయిన త‌న కుమారుడు గొల్ల‌పూడి శ్రీనివాస్ జ్ఞాపకార్థం ఈ అవార్డును అంద‌చేస్తున్నారు. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. ఓ త‌మిళ సినిమాకు అవార్డు వ‌చ్చి 18 ఏళ్ల‌య్యింది. 2001లో కుట్టి అనే త‌మిళ సినిమాకు ఈ అవార్డ్ ద‌క్కింది. ఇన్నేళ్ల త‌ర్వాత ఇప్పుడే మ‌రోసారి త‌మిళ సినిమాకు ఈ అవార్డ్ రావ‌డం గ‌మ‌నార్హం.

More News

రష్మీ కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

బ‌జ‌ర్‌ద‌స్త్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ర‌ష్మీ గౌత‌మి.. ఇప్పుడు త‌న‌కు న‌చ్చిన సినిమాల్లో న‌టిస్తుంది. సినిమాల్లో కాస్త గ్లామ‌ర్ డోస్ పెంచే న‌టిస్తుంది కూడా.

ఆది సాయికుమార్‌, వేదిక జంటగా ద్విభాషా చిత్రం ప్రారంభం

ఆది సాయికుమార్, వేదిక హీరో హీరోయిన్లుగా తెలుగు, త‌మిళ బై లింగ్వుల్ చిత్రం నేడు లాంఛ‌నంగా ప్రారంభమైంది. కార్తీక్ విఘ్నేశ్ ద‌ర్శ‌కుడు.

రెండో జాబితా విడుదల.. పవన్‌ పోటీస్థానం పై సస్పెన్స్

జనసేన రెండో అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు. కాగా.. ఈ జాబితాను కూడా మొదటి జాబితాలాగే అర్ధరాత్రి 2గంటలకు ప్రకటించారు.

అందమైన ప్రదేశాల్లో శరవేగంగా అసలేం జరిగింది 

శ్రీరాం, సంచితా పడుకునే హీరోహీరోయిన్లుగా ఎక్సోడస్ మీడియా నిర్మిస్తున్న అసలేం జరిగింది. కెమెరామెన్ ఎన్‌వీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు.

సెన్సార్ బోర్డు భ‌య‌ప‌డిందా?

రాంగోపాల్ వ‌ర్మ, అగ‌స్త్య మంజు ద‌ర్శ‌క‌త్వంలో రాంగోపాల్ వ‌ర్మ‌, రాకేష్ రెడ్డి, దీప్తి బాల‌గారి నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌'. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి