close
Choose your channels

బాల‌య్య ఖాతాలో మ‌రో ఫ్యాక్ష‌న్ మూవీ

Saturday, June 9, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాల‌య్య ఖాతాలో మ‌రో ఫ్యాక్ష‌న్ మూవీ

తెలుగునాట ఫ్యాక్ష‌న్ చిత్రాల క‌థానాయ‌కుడిగా ట్రెండ్ సృష్టించారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. స‌మ‌ర‌సింహారెడ్డితో మొద‌లుపెట్టి న‌ర‌సింహనాయుడు, సీమ సింహం, చెన్న‌కేశ‌వ రెడ్డి.. ఇలా వ‌రుస సినిమాల‌తో ఆ త‌ర‌హా చిత్రాల‌కు చిరునామాలా నిలిచారు. ఆ త‌రువాత పూర్తిస్థాయి ఫ్యాక్ష‌న్ చిత్రం చేయ‌ని బాల‌య్య‌.. చాలా కాలం త‌రువాత ఇదే జోన‌ర్‌లో ఓ యాక్ష‌న్‌ సినిమా చేయ‌బోతున్నారు.

చెన్న‌కేశ‌వ‌రెడ్డి చిత్రాన్ని తెర‌కెక్కించిన వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని సి.క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నారు. ఆగ‌స్టులో ప్రారంభం కానున్న ఈ సినిమాని వ‌చ్చే ఏడాది వేస‌వికి విడుద‌ల చేసే అవ‌కాశ‌ముంది.

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌.. త‌న తండ్రి నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న య‌న్‌.టి.ఆర్ చిత్రంలో న‌టిస్తున్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.