close
Choose your channels

భాగ్య‌శ్రీ భ‌ర్త అరెస్ట్‌

Wednesday, July 3, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భాగ్య‌శ్రీ భ‌ర్త అరెస్ట్‌

భాగ్య‌శ్రీ అంటే ఎవ‌రికీ ఠ‌క్కున గుర్తుకు రాదేమో కానీ.. `ప్రేమ పావురాలు` హీరోయిన్ అంటే వెంట‌నే గుర్తుకు వస్తుంది. ఈ అమ్మ‌డు తొలి చిత్రం `మైనే ప్యార్ కియా`(తెలుగులో ప్రేమ‌పావురాలు)తో ప్రేక్ష‌కుల అభిమానంతో పాటు అవార్డులు కూడా ద‌క్కించుకుంది. ఆ సినిమా స‌మ‌యంలోనే చిన్న‌నాటి స్నేహితుడు హిమాల‌యా దాసానిని పెళ్లి చేసుకుంది. పెళ్లి త‌ర్వాత ఈమె సినిమా రంగానికి దూరంగా ఉన్నారు.

మ‌ధ్య‌లో బాల‌కృష్ణ `యువ‌ర‌త్న రాణా`లో చెల్లెలు పాత్ర‌లోనూ న‌టించింది. ఈ మ‌ధ్య‌నే సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా `2 స్టేట్స్‌` తెలుగు రీమేక్‌లోనూ న‌టించారు. ఈ సినిమా కొన్ని కార‌ణాల‌తో ఆగింది. కాగా భాగ్య‌శ్రీ భ‌ర్త హిమాల‌య దాసాని గ్యాంబ్లింగ్ రాకెట్‌కు సంబంధించిన ఆరోపణ‌ల‌తో అరెస్ట్ అయ్యారు. బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. భాగ్య‌శ్రీ కొడుకు అభిమ‌న్యు దాసాని హీరోగా కూడా ఈ ఏడాది ప‌రిచ‌యం అయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.