close
Choose your channels

అది ఫేక్ న్యూస్.. నమ్మకండి: భారత్ బయోటెక్

Saturday, July 4, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రముఖులకు సంబంధించిన ఫోటో కనిపిస్తే చాలు.. దాని పూర్వాపరాలు తెలుసుకోకుండా.. ఆ ఫోటో చుట్టూ ఓ కథ అల్లేసి వైరల్ చేయడం సోషల్ మీడియాలో పరిపాటిగా మారిపోయింది. భారత్ బయోటెక్ సంస్థ ఉపాధ్యక్షుడి విషయంలోనూ సోషల్ మీడియా ఇలాంటి అత్యుత్సాహాన్నే చూపించింది. భారత్ బయోటెక్ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ వీకే శ్రీనివాస్ చేతి నుంచి ఓ నర్స్ ఇంజెక్షన్ గుచ్చుతున్నట్టుగా ఉన్న ఓ ఫోటోను చూసి ఓ కథ అల్లేసి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇది చూసిన భారత్ బయోటిక్ సంస్థ వెంటనే వివరణ ఇచ్చింది.

అసలు విషయం ఏంటంటే.. భారత్ బయోటెక్ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ వీకే శ్రీనివాస్ చేతికి ఓ నర్సు ఇంజెక్షన్ గుచ్చుతున్నట్టుగా ఓ ఫోటో బయటకు వచ్చింది. ఇంకేముంది.. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా శ్రీనివాస్ కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోయింది. దీంతో వెంటనే ఆ సంస్థ స్పందించి.. అది ఫేక్ న్యూస్ అని.. దానిని నమ్మవద్దని తెలిపింది. తమ ప్రొడక్షన్ స్టాఫ్‌కు నిత్యం వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటామని.. అందులో భాగంగానే శ్రీనివాస్‌కు రక్తం సేకరిస్తుండగా తీసిన ఫొటో మాత్రమేనని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. కరోనా వ్యాక్సిన్‌ను ఆగస్ట్ 15 నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.