Bhatti Vikramarka: యాదాద్రి వివాదంపై స్పందించిన భట్టి విక్రమార్క.. ట్రోల్స్‌కు కౌంటర్..
Send us your feedback to audioarticles@vaarta.com
యాదాద్రి వివాదంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నాను అని స్పష్టంచేశారు. ఈ ఫోటోను పట్టుకుని కావాలని కొందరు ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు.
"యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాం. దేవుడి ముందు ఎత్తుగా కూర్చోవటం ఇష్టం లేక.. కావాలనే చిన్న పీట మీద కూర్చున్నాను. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తున్నాను. మూడు శాఖలతో రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాను. నేను ఎవరికీ తలవంచే వాడిని కాదు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు. నాకు అవమానం జరిగిందన్న వార్తలపై స్పందిస్తూ.. మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నాకు ఎలాంటి అవమానం జరగలేదు. అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను" అని తెలిపారు.
కాగా యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద పీటలపై కూర్చున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ మాత్రం తక్కువ ఎత్తు ఉన్న పీటలు వేశారు. ఈ ఫొటోలు బయటకు రావడంతో పెద్ద దుమారం రేపింది. బీఆర్ఎస్ నేతలు ఈ వీడియోను వైరల్ చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
యాదాద్రీశుడి సాక్షిగా దళిత ఉప ముఖ్యమంత్రికి ఘోర అవమానం జరిగిందని ట్రోల్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దళితులను వివక్షకు గురిచేస్తు్‌న్నారంటూ పోస్టు పెట్టారు. అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ధీటుగా కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. మొత్తానికి ఈ ట్రోల్స్‌పై భట్టి తనదైన శైలిలో స్పందించి క్లారిటీ ఇచ్చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout