close
Choose your channels

Vanga Geetha: మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ప్రేమ.. వంగా గీత వ్యాఖ్యలు వైరల్..

Monday, May 20, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Vanga Geetha: మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ప్రేమ.. వంగా గీత వ్యాఖ్యలు వైరల్..

ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపైనే అందరి చూపు నెలకొని ఉంది. నామినేషన్ల దగ్గర నుంచి ప్రచారం ముగిసే వరకూ తెలుగు రాష్ట్రాల్లో పిఠాపురం పేరు మార్మోగిపోయింది. అలాగే మీడియా నుంచి రాజకీయ విశ్లేషకుల వరకూ అందరు పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌కు పోటీగా వైసీపీ తరపున వంగా గీత బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ప్రచారంలో చివరి రోజున వంగా గీత గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తానంటూ సీఎం జగన్ హామీ ఇవ్వడం పిఠాపురంలో పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది.

ఇటు జనసేన తరుఫున పవన్ కళ్యాణ్, వైసీపీ తరపున గీత ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డారు. ప్రచారం దగ్గర నుంచి పోల్ మేనేజ్‌మెంట్ వరకూ ఒకరికొకరు ఏమాత్రం తగ్గకుండా చేశారు. దీంతో పిఠాపురంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అయితే పిఠాపురం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనేదీ జూన్ 4వ తేదీన కౌంటింగ్ రోజు తేలనుంది. ఓవైపు పవన్ కళ్యాణ్‌కు భారీ మెజారిటీ ఖాయమని కూటమి నేతలు ప్రచారం చేస్తుంటే.. వంగా గీతదే విజయమంటూ వైసీపీ నేతలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

Vanga Geetha: మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ప్రేమ.. వంగా గీత వ్యాఖ్యలు వైరల్..

ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా వంగా గీత పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకి అతీతంగా తమకు మెగా కుటుంబం అంటే ఎప్పటికీ అభిమానమేనని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేయలేదని.. నియోజకవర్గంలో ఎవరైనా చేసినా కూడా ఒప్పుకోనని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఏమన్నారంటే..

Vanga Geetha: మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ప్రేమ.. వంగా గీత వ్యాఖ్యలు వైరల్..

"రాజకీయాలకు అతీతంగా అన్నయ్యగారంటే (మెగాస్టార్ చిరంజీవి) మాకు అభిమానం. వాళ్లు ఎవరన్నా మాకు గౌరవం ఎక్కువ. వాళ్లకు కూడా నా గురించి తెలుసు. రాజకీయం వేరు, మిగతావి వేరు. నాకు అన్నయ్యగారంటే చాలా గౌరవం. మెగాస్టార్ ఫ్యామిలీ అందరి మీద కూడా అంతే గౌరవం. నాగబాబు గారైనా, ఎవరైనా సరే. ఎన్నికలప్పుడు కూడా మా నియోజకవర్గంలో వ్యక్తిగత విమర్శలు లేవు. మేము వ్యక్తిగత విమర్శలు చేయం, చేస్తే ఒప్పుకోం" అని వంగా గీత చెప్పారు.

కాగా గతంలో పిఠాపురం అసెంబ్లీ నియోజవర్గం నుంచి వంగా గీత ఎమ్మెల్యేగా గెలుపొందారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైనప్పుడు.. వంగా గీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2019లో వైసీపీ తరపున కాకినాడ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.