close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: విశ్వ ఎలిమినేట్.. షాక్‌లో హౌస్‌మేట్స్, ఇదేంటీ ఇలా జరిగింది ..?

Monday, November 8, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: విశ్వ ఎలిమినేట్.. షాక్‌లో హౌస్‌మేట్స్, ఇదేంటీ ఇలా జరిగింది ..?

బిగ్‌బాస్ 5 తెలుగు తొమ్మిదో వారం ఎండింగ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట ఫన్‌గా షోను ప్రారంభించారు నాగ్. బిగ్‌బాస్ ఫైనలిస్టుల్లో ఒకరిగా అందరూ భావిస్తున్న విశ్వ ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. వెళుతూ వెళుతూ అందరి హృదయాలు బరువెక్కించాడు. ముఖ్యంగా శ్రీరామ్, షణ్ముఖ్‌, రవిల గురించి బాగా మాట్లాడాడు విశ్వ. మరి అతని ఎలిమినేషన్‌కు దారి తీసిన పరిస్ధితులు, హౌస్‌లో జరిగిన పరిణామాలు తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: విశ్వ ఎలిమినేట్.. షాక్‌లో హౌస్‌మేట్స్, ఇదేంటీ ఇలా జరిగింది ..?

ఇక ఎప్పటిలాగే నాగ్ ఎంట్రీ ఇచ్చి.. సండే‌ను ఫండేగా మార్చేందుకు ఇంటి సభ్యులకు టాస్క్‌లు ఇచ్చారు. వస్తూ వస్తూనే హౌస్‌మేట్స్‌ను రెండు గ్రూపులుగా విభజించి ‘‘బొమ్మ ఇక్కడ పాట అక్కడ’’ అనే గేమ్ ఆడించారు. సన్నీ, ప్రియాంక, షణ్ముఖ్, కాజల్, విశ్వలు ఒక టీమ్. యానీ, శ్రీరామ్, రవి, సిరి, మానస్ లు సెకండ్ టీమ్. గేమ్ లో భాగంగా ప్లాస్మా టీవీలో వచ్చే విజువల్స్ ను చూస్తూ పాటను గెస్ చేయాలి. టీమ్‌ ఏకి సన్నీ కెప్టెన్‌గా ఉండగా, మరోవైపు టీమ్‌ బీకి రవి కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ గేమ్‌ ఆద్యంతం కామెడీ, హుషారుగా సాగింది. ఇందులో ఎక్కువ రైట్స్ ఆన్సర్స్ చెప్పి టీమ్‌ బీ విజయం సాధించింది. అనంతరం నామినేషన్‌లో ఉన్న శ్రీరామ్‌, కాజల్‌, విశ్వ, జెస్సీ, ప్రియాంకలను సేవ్ చేసే ప్రక్రియలో భాగంగా ఐదుగురి ముందు కుండలు పెట్టిన నాగార్జున.. అందులో రింగ్ ఉందని.. దానిపై బిగ్ బాస్ 'ఐ' ఉంటే సేఫ్ అని చెప్పారు. శ్రీరామ్ కి బిగ్ బాస్ ఐ రావడంతో అతడు సేవ్ అయ్యాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: విశ్వ ఎలిమినేట్.. షాక్‌లో హౌస్‌మేట్స్, ఇదేంటీ ఇలా జరిగింది ..?

అనంతరం నాగ్‌ ఇంటిసభ్యులతో 'నేను ఎవరిని?' గేమ్‌ ఆడించారు. దీనిలో భాగంగా ఫిష్ బౌల్‌లో ఉన్న హౌస్ మేట్స్ పేరుని కెమెరా ముందు చూపించి ఆ తరువాత వాళ్లను ఇమిటేట్ చేస్తే.. మిగిలిన హౌస్ మేట్స్ గెస్ చేయాల్సి వుంటుంది. ఈ టాస్క్‌లో హౌస్ మేట్స్ బాగా నవ్వించారు. ఇందులో సన్నీ టీమ్ విన్నర్స్ గా నిలిచింది. ఇక నామినేషన్‌లో మిగిలిన నలుగురి చేతుల్లో బ్యాడ్జ్‌లు పెట్టారు నాగ్. దానిపై హీరో ఉంటే సేఫ్.. విలన్ ఉంటే అన్ సేఫ్. ఇందులో జెస్సీ బ్యాడ్జ్‌కి హీరో రావడంతో అతడు సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: విశ్వ ఎలిమినేట్.. షాక్‌లో హౌస్‌మేట్స్, ఇదేంటీ ఇలా జరిగింది ..?

ఆ తర్వాత ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో చెప్పాలని ఇంటిసభ్యులను ఆదేశించారు నాగార్జున. తొలుత సన్నీ- షణ్ముఖ్‌ని, షణ్ముఖ్ - ప్రియాంకను, ప్రియాంక - విశ్వను, విశ్వ - జెస్సీని, జెస్సీ - కాజల్‌ను, కాజల్ - సిరిని, సిరి - కాజల్‌ని, మానస్ - షణ్ముఖ్‌ని, రవి - మానస్‌ని, శ్రీరామ్ - కాజల్‌ని, యానీ మాస్టర్ - సన్నీలను వరస్ట్ పెర్ఫార్మర్‌గా చెప్పారు. ఎక్కువ ఓట్లు పడ్డ కాజల్‌ వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నికైంది. ఆమెని రేపు (సోమవారం) ఎపిసోడ్‌లో జైలుకి పంపాల్సి ఉంటుంది. నామినేషన్‌లో మిగిలిన విశ్వ, కాజల్, ప్రియాంక చేతుల్లో బాక్సులు పెట్టారు నాగార్జున. ప్రియాంక బాక్సులో సేఫ్ అని ఉండడంతో ఆమె సేవ్ అయినట్లు హోస్ట్ ప్రకటించారు. అనంతరం నామినేషన్‌లో మిగిలిన విశ్వ - కాజల్‌లను గార్డెన్ ఏరియాలోకి పిలిచిన నాగార్జున... వారిద్దరినీ ఒకేసారి బాక్సులు ఓపెన్ చేయమని చెప్పారు. అందులో ఉన్న బెలూన్స్ పైకి వెళ్తే వాళ్లు సేఫ్ అని.. వెళ్లని వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. కాజల్ బాక్స్‌లో ఉన్న బెలూన్స్ పైకి వెళ్లడంతో ఆమె సేఫ్ అయింది. విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో హౌస్‌మేట్స్ షాకయ్యారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: విశ్వ ఎలిమినేట్.. షాక్‌లో హౌస్‌మేట్స్, ఇదేంటీ ఇలా జరిగింది ..?

హౌస్‌లో అందరిచేత హీరోగా అనిపించుకున్న విశ్వ ఎలిమినేట్‌ అని తెలిసి యానీ మాస్టర్‌ కన్నీళ్లు పెట్టుకుంది. సన్నీ, శ్రీరామ్‌లు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అటు ఇంటి సభ్యులకి వీడ్కోలు చెప్పే క్రమంలో విశ్వ కూడా ఎమోషనల్‌ అయ్యాడు. ఇక స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత విశ్వతో నాగ్ గేమ్ ఆడించారు. హౌస్‌మేట్స్ పర్ఫార్మెన్స్‌కు ర్యాంకులు ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో విశ్వ పది నుంచి ఒకటికి ఇచ్చుకుంటూ వెళ్లాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: విశ్వ ఎలిమినేట్.. షాక్‌లో హౌస్‌మేట్స్, ఇదేంటీ ఇలా జరిగింది ..?

దీనిలో భాగంగా ఆయన మొదట ప్రియాంకకి పదవ ర్యాంక్ ఇచ్చాడు. ఇంటిలోకి వచ్చిన మొదట్లో హార్ట్ కి కనెక్ట్ అయిన అమ్మాయి అని, తనని తప్పుగా అర్థం చేసుకున్నావని అన్న మాట బాధగా అనిపించిందని, తప్పు చేయడం తప్పు కాదు, రియలైజ్‌ కాకపోవడం తప్పు అని చెప్పాడు. ఇక కాజల్‌కి తొమ్మిదో ర్యాంక్‌ ఇస్తూ డల్ అవుతున్నావని, కాన్ఫిడెన్స్ ని కోల్పోతున్నావని చెప్పాడు. తన ఆట తనలా ఆడాలని చెప్పాడు. జెస్సీకి ఎనిమిదో ర్యాంక్‌ ఇస్తూ టాస్క్ లో ఊహించిన విధంగా గివప్‌ ఇచ్చావని, బాగా ఆడాలని సలహా ఇచ్చాడు. యానీ మాస్టర్ కి ఏడో ర్యాంక్‌ ఇస్తూ, ఆటలోవెనకడుగు వేయోద్దని, తనొక ఫైటర్‌ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: విశ్వ ఎలిమినేట్.. షాక్‌లో హౌస్‌మేట్స్, ఇదేంటీ ఇలా జరిగింది ..?

మానస్‌కి ఆరో ర్యాంక్‌ ఇస్తూ విన్నింగ్, లూజింగ్‌ కామన్‌ అని, ఓడిపోయినా దాన్ని స్వీకరించి మరింత ముందుకు పోవాలని సలహా ఇచ్చాడు. సిరికి ఐదో ర్యాంక్‌ ఇస్తూ తనొక స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని, ఆటలో దూకుడుమీదుంటుందని, ఎవరికైనా ఇచ్చిపడేస్తుందన్నాడు. సన్నీకి నాలుగో ర్యాంక్‌ ఇచ్చాడు .తన ఆట ఆడాలని, అలా ఆడితే గేమ్‌నే అటు ఇటూగా మార్చే సత్తా ఉందని ప్రశంసించాడు. షణ్ముఖ్‌కి మూడో ర్యాంక్ ఇచ్చి గట్టిగా క్లాస్ పీకాడు. రవి గురించి చెబుతూ, ఆయన గుంట నక్క కాదని, చాలా మంచి వ్యక్తి అని, టాస్క్‌లు బాగా ఆడతాడని ప్రశంసించారు. సూర్యునిలాగే ఎప్పుడూ హైలోనే వుండాలని ఆకాంక్షించాడు. ఇక శ్రీరామ్‌ జెన్యూన్‌ పర్సన్‌ అని చెప్పాడు. తనకు తమ్ముడు లేడని, శ్రీరామ్‌లో తమ్ముడిని చూసుకుంటున్నానని చెబుతూ అందరికి ఆల్‌ ది బెస్ట్ చెప్పాడు విశ్వ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.