close
Choose your channels

రజనీకాంత్ సినిమాకు బాలీవుడ్ సీక్వెల్

Monday, August 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రజనీకాంత్ సినిమాకు బాలీవుడ్ సీక్వెల్

సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రధారులుగా రూపొందిన సైకలాజికల్ హారర్ ఎంటర్ టైనర్ `చంద్రముఖి`. స్ల్పిట్ పర్సనాలిటీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. నిజానికి ఇది మలయాళ చిత్రం `మణిచిత్రాతాలు` సినిమాకు రీమేక్. పి.వాసు ఈ రీమేక్‌ను తెరకెక్కించారు. దీన్ని బాలీవుడ్‌లో బోల్ భులయ్యా పేరుతో ప్రియదర్శన్ 2007లో రీమేక్ చేశారు.

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారిగా నటించారు. దాదాపు పుష్కరకాలం తర్వాత ఈ చిత్రానికి బాలీవుడ్‌లో సీక్వెల్ రూపొందనుంది. `బోల్ భులయ్యా 2` పేరుతో తెరకెక్కబోయే ఈ సీక్వెల్‌లో అక్షయ్‌కుమార్ నటించడం లేదట. ఆయన స్థానంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. అనీజ్ బాజ్మీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 31న విడుదల చేయనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.