శంకర్ సినిమా నుండి తప్పుకున్న బాలీవుడ్ స్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ టైటిల్ పాత్రలో రూపొందుతోన్న చిత్రం `ఇండియన్ 2`. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. అయితే అజయ్ దేవగణ్ ప్రస్తుతం `తానాజీ`తో బిజీగా ఉన్నాడు.
డేట్స్ అడ్జస్ట్ చేయడానికి కుదరడం లేదు. దీంతో ప్రాజెక్ట్ చేసే అవకాశం లేదని చెప్పేశాడట. ఇప్పుడు శంకర్ మరో స్టార్ కోసం వెతుకులాటలో పడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న చెన్నై షెడ్యూల్ తర్వాత విదేశీ షెడ్యూల్ ప్లాన్ చేశాడట శంకర్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.