సైకిల్ రిపేరు చేయట్లేదని.. పోలీసులకు బాలుడి ఫిర్యాదు!
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే.. అసలు సైకిల్ రిపేర్‌కు పోలీసులకు సంబంధమేంటి..? అని కాస్త వింతగా ఉంది కదూ.. అవును ఈ ఘటన నిజంగానే కేరళలోని కోలివుడ్ జిల్లాలో చోటుచేసుకుంది. యూపీఎస్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆబిన్ తన సైకిల్ రిపేర్ వచ్చిందని సెప్టెంబర్-05న మెకానిక్ షాపులో ఇచ్చాడు. అయితే రోజులు గడుస్తున్నా రిపేర్ చేయకపోవడం.. ఏంటి అంకుల్ అని గట్టిగా అడిగిన ఆయన మాత్రం లెక్కలోకి తీసుకోలేదు. అంతేకాదు.. కొద్దిరోజుల పాటు షాపు మూసేశారు. దీంతో షాపు చుట్టు తిరిగినా ఫలితం లేకపోయింది. ఫోన్ నంబర్ తీసుకుని కాల్ చేసినా రేపు రా.. ఎల్లుండి రా అంటూ ఇలా తిప్పుకోవడం మొదలెట్టాడు. దీంతో చేసేదేమీ లేక మెప్పయూర్ పోలీసులకు ఉత్తరం రాశాడు.
లేఖలో ఏముంది..!
‘రిపేర్ కోసం సెప్టెంబర్-05 నా సైకిల్‌ను షాపులో ఇచ్చాను. ఆ టైమ్‌లో యజమానికి 200 రూపాయలు కూడా ఇచ్చాను. అయినప్పటికీ నా సైకిల్ రిపేరు కాలేదు. పైగా అస్తమానూ తిరుగుతున్నాం. షాపు మాత్రం మూసేసి ఉంది. సర్.. దయచేసి మీరు ఈ విషయంలో జోక్యం చేసుకుని నా సైకిల్ నాకు ఇప్పించగలరు’ అని లేఖలో పోలీసులను ఆబిన్ పేర్కొన్నాడు.
అందుకే ఆలస్యమైంది!
అయితే ఈ ఉత్తరం చదివిన పోలీసులు మొదట నవ్వకున్నప్పటికీ.. ఫిర్యాదు స్వీకరించి.. కేసు నమోదు చేసుకుని షాపు యజమానితో మాట్లాడి విద్యార్థికి సైకిల్ ఇప్పించారు. కాగా. షాపు యజమాని ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. తన కుమారుడి పెళ్లి పనుల్లో తాను బిజీ అయిపోయానని..అందుకే సైకిల్ రిపేర్ చేయడం ఆలస్యం అయ్యిందని వివరణ ఇచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వార్త విన్న, చదివిన జనాలు నవ్వుకుంటున్నారు. మరోవైపు వావ్ ఆబిన్ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments