సైకిల్ స్పీడ్‌కు తిరుగులేదు.. గ్లాసు జోరుకు ఎదురులేదు: చంద్రబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
సైకిల్ స్పీడ్‌కు తిరుగులేదు.. గ్లాసు జోరుకు ఎదురులేదని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తణుకులో జరిగిన రోడ్ షోలో పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సైకో జగన్‌ను అధికారం నుంచి దించడానికే మూడు పార్టీలు కలిశాయన్నారు. అగ్నకి ఆయువు తోడయినట్లు టీడీపీకి పవన్ తోడయ్యారని తెలిపారు. తనకు అనుభవం ఉంటే పవన్‌కు పవర్ ఉందని పేర్కొన్నారు. వ్యక్తిగత దాడులను తట్టుకుని పవన్ రాజకీయాల్లో నిలబడ్డారని కొనియాడారు.
ఏపీని కాపాడుకోవాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి క్షణం అభివృద్ధి కోసం తపించామని.. పోలవరాన్ని 72 శాతం పూర్తి చేసిన బాధ్యత ఎన్డీఏ పార్టీలకే దక్కిందన్నారు. అమరావతిని నిర్మించి అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలని భావించామని.. కానీ జగన్ వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. అందుకే అభివృద్ధి కావాలా? విధ్వంసం కావాలా? సంక్షేమం కావాలా? అని ప్రశ్నించారు. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని వెల్లడించారు.
ఇక పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రైతులను ఏడిపించిన జగన్ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలని తెలిపారు. బూతులు తిట్టి.. దాడులు చేసే మంత్రులు కేబినెట్‌లో ఉన్నారని విమర్శించారు. దోపిడీ మీద దృష్టి పెట్టిన నేతలు ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారు అని ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే కొంత తగ్గానని.. అయినా ప్రజలు గెలుస్తారన్నారు. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రానికి అవసరం అని పవన్ వెల్లడించారు. పంటకు మొలకలు వస్తున్నాయని రైతులు అంటే వారిని మంత్రి కారుమూరి చీత్కారంగా మాట్లాడారని మండిపడ్డారు. అన్నం పెట్టిన రైతును ఏడిపించిన మంత్రి కొడుకు ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవాలని పిలుపునిచ్చారు. ఇక పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే ఇరిగేషన్ మంత్రి డ్యాన్సులు చేస్తాడని.. బూతులు తిట్టే మంత్రి, డ్యాన్సులు చేసే మంత్రి వైసీపీలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
మరోవైపు జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను పవన్ కళ్యాణ్ నియమించారు. ఇందులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, నృత్య దర్శకుడు జానీ మాస్టర్, నటులు సాగర్, పృథ్విరాజ్, కమెడియన్లు హైపర్ ఆది, గెటప్ శ్రీనులను స్టార్ క్యాంపెయినర్లుగా నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. వీరు జనసేన అభ్యర్థులు పోటీ చేసే 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో ప్రచారం నిర్వహిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout