close
Choose your channels

చిరు, చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో సురేంద‌ర్ రెడ్డి చిత్రం?

Monday, October 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరు, చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో సురేంద‌ర్ రెడ్డి చిత్రం?

`ఖైదీ నంబ‌ర్ 150`తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా `సైరా న‌ర‌సింహారెడ్డి` అంటూ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తున్న చిరు.. ఆ త‌రువాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్‌లో త‌న 153వ సినిమా చేయ‌నున్నారు. అలాగే.. మ‌రో ప్రాజెక్ట్ కూడా సెట్ అయ్యింద‌ని స‌మాచారం.

కాస్త వివ‌రాల్లోకి వెళితే, మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ `లూసిఫ‌ర్‌`కి సంబంధించిన తెలుగు రీమేక్ రైట్స్‌ను మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. `లూసిఫ‌ర్‌`లో మోహ‌న్ లాల్ పోషించిన పాత్ర‌లో చిరంజీవి.. కీల‌క పాత్ర‌లో న‌టించిన పృథ్వీరాజ్ సుకుమార‌న్ రోల్‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తార‌ని టాక్‌. అంతేకాదు.. ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌కి న‌టుడు పృథ్వీరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. తెలుగు వెర్ష‌న్‌కి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

కాగా.. చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన `మ‌గ‌ధీర‌`, `బ్రూస్‌లీ` చిత్రాల్లో చిరు అతిథిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే చిరు రీ-ఎంట్రీఫిల్మ్ `ఖైదీ నంబ‌ర్ 150` కోసం `అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు` పాట‌లో చ‌ర‌ణ్ త‌ళుక్కున మెరిసాడు. ఈ నేప‌థ్యంలో.. చిరు, చ‌ర‌ణ్ పూర్తిస్థాయిలో క‌ల‌సి న‌టించ‌నుండ‌డం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే విష‌య‌మే. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.