close
Choose your channels

తెలుగు రాష్ట్రాల కొంపముంచిన ఢిల్లీ ‘కరోనా’ కనెక్షన్స్..!

Tuesday, March 31, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు రాష్ట్రాల కొంపముంచిన ఢిల్లీ ‘కరోనా’ కనెక్షన్స్..!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలు కాస్త కోలుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలో బాంబులాంటి షాకింగ్ విషయాన్ని వినాల్సి వచ్చింది. దీంతో ఇప్పటి వరకూ ఇరు రాష్ట్రాల్లో ఉన్న కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీనంతటికి కారణం దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జరిగిన కొన్ని కార్యకలాపాలే.! అసలు ఢిల్లీ కొంపముంచడమేంటి..? ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరగడానికి ఢిల్లీకి లింకేంటి..? ఇంతకీ ఏం జరిగింది..? ఎలా జరిగింది..? అనే ఆసక్తికర, షాకింగ్ విషయాలు www.indiaglitz.com అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఒక్కసారిగా కలకలం..

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ మసీదు పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇందుకు కారణం ఇక్కడికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు వస్తుంటారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో అక్కడకు మత ప్రార్థనలకు వెళ్లినవారి కుటుంబాల్లో, ఆయా రాష్ట్రాల్లో, దేశాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇందుకు కారణం ఇక్కడికి ఇండోనోషియాతో పాటు పలు దేశాల నుంచి ఈ ప్రార్థనకు రావడమే. 800 మంది ఇండోనోషియా వారు వచ్చారని ఇప్పటికే కేంద్ర హోంశాఖ గుర్తించింది. వారంతా వీసా నిబంధనలు ఉల్లంఘించారని..వారిపై కొరడా ఝులిపించేందుకు గాను కేంద్ర హోంశాఖ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని కరీంనగర్‌లో పర్యటించిన పలువురు ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో వారికి ఆశ్రయం కల్పించిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒణికిపోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల వారే..

ఈ ప్రార్థనలకు వెళ్లిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన చెందిన వారు చాలా మందే ఉన్నారు. వీరిలో తెలంగాణకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఉండగా.. ఏపీకి చెందిన వారు ఎంత మంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు.. కానీ కొంతమందిని మాత్రం ప్రభుత్వం గుర్తించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నీ ఇప్పుడు ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ప్రార్థనాలు చేసి వచ్చిన వారి కోసం గాలింపు మొదలుపెట్టాయి. అక్కడ ప్రార్థనాలు చేసిన వారిలోనే అధికంగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండటంతో... తెలుగు రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్ట్రాలోని ఏయే ప్రాంతాల వారు వెళ్లారో తెలుసుకుని వారిని క్వారంటైన్‌కు తరలించే పనిలో ఇరు ప్రభుత్వాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు తెలంగాణలో ఇప్పటి వరకూ ఆరుగురు మరణించారు.

తెలంగాణకు చెందిన వారే ఎక్కువ..

తెలంగాణకు చెందిన వారు 1030 మంది వెళ్లినట్టు ప్రభుత్వం గుర్తించింది. వారిలో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి 603 మంది హాజరైనట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటనలో తెలిపింది. తర్వాతి స్థానంలో నిజామాబాద్ 80 ఉంది. నిజామాబాద్ 80, నల్లగొండ 45, వరంగల్ అర్బన్ 38, ఆదిలాబాద్ 30, ఖమ్మం 27, నిర్మల్ 25, సంగారెడ్డి 22 మంది మర్కజ్‌ మసీదు ప్రార్థనల్లో పాల్గొన్నారని తెలిపింది. మరోవైపు.. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా కొందరు మాత్రం అస్సలు పట్టించుకోకుండా ఇష్టానుసారం తిరిగేస్తున్నారు.

ఆంధ్రా విషయానికొస్తే..

ఏపీలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరిందని మంగళవారం నాడు ప్రభుత్వం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కేవలం 12 గంటల్లోనే 17 కొత్త కేసులు నమోదవ్వడం షాకింగ్ కలిగిస్తోంది. కాగా ఢిల్లీ మసీదులో ప్రార్థనలకు వెల్లిన వారిలో కర్నూలు నుంచి 189, గుంటూరు నుంచి 88, అనంతపూర్ 73, ప్రకాశం 67, నెల్లూరు 68, వైస్సార్ కడప 59, క్రిష్ణా 43, విశాఖపట్నం 42, చిత్తూరు 36, తూర్పుగోదావరి 27, పశ్చిమ గోదావరి 16, విజయనగరం నుంచి 03 ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లారని ప్రభుత్వం తెలిపింది. కాగా.. వీరిలో చాలా వారిని గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. ఇంకా కొందర్ని గుర్తించే పనిలో నిమగ్నమైంది.

ఎక్కడెక్కడ ఎన్ని..!?

ఇదిలా ఉంటే.. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరుకుంది. ప్రకాశంలో అత్యధికంగా 11 కేసులు నమోదవ్వగా, చీరాల పట్టణంలో కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి 164 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 17 మందికి కరోనా పాజిటివ్‌గా రాగా.. 147 మందికి నెగిటివ్‌ వచ్చింది. గుంటూరు - 9, విశాఖ - 6, కృష్ణా - 5, తూ.గో - 4, అనంతపురం - 2, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ పొడగిస్తారా!?

మొత్తానికి చూస్తే.. ఢిల్లీ కనెక్షన్స్ తెలుగు రాష్ట్రాల కొంపముంచేశాయ్. తెలంగాణలో హైదరాబాద్.. ఏపీలోని కర్నూల్ వారే ఈ ప్రార్థనలకు ఎక్కువగా వెళ్లారు. అంటే.. వారితో పాటు వాళ్ల కుటుంబీకులను, వారు ఎవరెవరితో తిరిగారో వారికి.. ఇలా అందర్నీ గుర్తించి కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితి ఇలానే కొనసాగితే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ సంగతేంటో కానీ.. తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా పొడిగించే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.