close
Choose your channels

ఉపాస‌న‌కు దాదాసాహెబ్ ఫాల్కే

Sunday, April 21, 2019 • తెలుగు Comments

ఉపాస‌న‌కు దాదాసాహెబ్ ఫాల్కే

ముంబైలో శ‌నివారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఇందులో మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ద‌క్కింది.  2019 సంవ‌త్స‌రానికిగానూ..  ఈ అవార్డును ఉపాస‌న కామినేని కొణిదెల అందుకున్నారు. సామాజిక సేవ‌లో ఆమె అత్యుత్త‌మ ప్ర‌తిభ‌కుగానూ ఈ అవార్డు ద‌క్కింది. ఉపాస‌న‌కు ఈ అవార్డు రావ‌డంపై మెగా కుటంబం చాలా హ్యాపీగా ఉంది. ఉపాస‌న భ‌ర్త‌, హీరో రాంచ‌ర‌ణ్ త‌న సంతోషాన్ని ఫేస్‌బుక్ వేదిక‌గా వ్య‌క్తం చేశారు. `డియ‌ర్ ఉప్సి..(ఉపాస‌న‌ను రాంచ‌ర‌ణ్ పిలుచుకునే ముద్దుపేరు) నీకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం నా కెంతో గ‌ర్వంగా ఉంది` అంటూ మెసేజ్‌తో పాటు ఉపాసన అవార్డు ప‌ట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. 

Get Breaking News Alerts From IndiaGlitz