close
Choose your channels

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు

Monday, April 29, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. రిజర్వేషన్ల రద్దు అంశం మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. రేవంత్‌తో పాటు మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్లుగా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోందని ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. అలాగే పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ట్విట్టర్ హ్యాండిల్స్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ డీప్ ఫేక్ వీడియోను ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది. ఝార్ఖండ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఈ వీడియో బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాని మోదీ హెచ్చరించారు.

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు

కాగా ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా.. సిద్దిపేట సభలో మాట్లాడుతూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై కేంద్ర హెంమంత్రిత్వ శాఖ సీరియస్ అయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. బీజేపీ నేతలు, కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో IPC సెక్షన్ 153, 153A, 465, 469, 171G మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్ 66C కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వీడియోను అప్‌లోడ్ చేసిన వారితో పాటు షేర్ చేసిన ఖాతాల సమాచారాన్ని కోరుతూ ట్విట్టర్‌, ఫేస్‌బుక్ కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేయడం గమనార్హం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.